గుంటూరు రాజకీయాలు మిర్చి కన్నా ఘాటు అన్నట్టుగా సాగుతున్నాయి. మేయర్ చేసిన వ్యాఖ్యల చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిన్న బంద్ సందర్భంగా మేయర్ మనోహర్.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది జనసేన. ఈ వ్యాఖ్యలకు నిరసనగా.. ఇవాళ మేయర్ ఆఫీస్ ముట్టడికి జనసేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఎస్పీని కలిసిన జనసేన నేతలు.. ఫిర్యాదు చేశారు. మేయర్ కావటి మనోహర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి చేశారు. అలాగే అరెస్ట్ చేసిన జనసేన నేతలను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక మేయర్ క్షమాపణ చెప్పకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో పవన్‌కి క్షమాపణ చెప్పేది లేదంటున్నారు మేయర్ కావటి మనోహర్. తమ పార్టీ అధినేతనూ, కార్యకర్తలనూ పవన్ గతంలో ఎన్నోసార్లు దూషించారని.. ఆయన క్షమాపణ చెప్తేనే తానూ చెప్తా అంటున్నారు. కాగా చంద్రబాబు నాయుడుకు రిమాండ్‌కు నిరసనగా బంద్ పాటిస్తూ షాపులు బంద్ చేయించారు టీడీపీ, జనసేన నాయకులు. అయితే అరండల్ పేటలో బంద్ చేసిన దుకాణాలు తెరిపించే ప్రయత్నం చేశారు మేయర్ కావటి మనోహర్. దీంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు పార్టీల నేతలు బాహాబాహీగా తలపడడంతో అరండల్‌పేట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈక్రమంలోనే జనసేన, వైసీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఇరుపార్టీ నాయకుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థతిని గమనించిన పోలీసులు జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో మేయర్ మనోహర్ పవన్‌పై అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతన్నారు. వీటికి నిరసనగా మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు జనసేన నేతలు. అయితే పోలీసులు ముందుగానే జనసేన నేతల్నిహౌస్ అరెస్ట్ చేశారు. మరి మేయర్ వర్సెస్ జనసేన నేతల గొడవ ఎలా చల్లారుతుందో చూడాలి.
వైసీపీ కి ఒక చట్టం జనసేనకు ఒక చట్టమా జగన్?
శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై గుంటూరు మేయర్ అనుచిత వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యరీతిలో నిరసనకు సిద్ధమైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు గార్లను, ఇతర నాయకులను పోలీసులతో… pic.twitter.com/tCORAZVjPp
— JanaSena Party (@JanaSenaParty) September 12, 2023
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..