Kurnool Gold Mine: స్వర్ణసీమగా మారనున్న రాయలసీమ.. కర్నూలు జిలాల్లో బంగారు నిక్షేపాల తవ్వకాలు

|

Feb 25, 2023 | 6:54 AM

రాయలసీమకు రతనాల సీమగా పేరుంది. కానీ ఇప్పుడు బంగారు సీమగా మారబోతోంది. ఓ కంపెనీ జరుపుతోన్న అన్వేషణ ఫలిస్తే నిజంగానే బంగారు భూమిగా మారిపోనుంది రాయలసీమ.

Kurnool Gold Mine: స్వర్ణసీమగా మారనున్న రాయలసీమ.. కర్నూలు జిలాల్లో బంగారు నిక్షేపాల తవ్వకాలు
Gold Mines In Kurnool
Follow us on

రాయలసీమలో వజ్ర వైఢూర్యాలు, రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారంటారు. కర్నూలు జిల్లాలో ఇప్పటికీ వజ్రాలు, రత్నాలు, బంగారం కోసం పొలాల్లో అన్వేషిస్తారు ప్రజలు. ఎక్కడెక్కడినుంచో వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే, ఇదంతా ట్రాష్ అనుకునేవారు కొందరు. కానీ, ఇప్పుడు ఓ కంపెనీయే బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు జరుపుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి గ్రామాల్లో బంగారం కోసం సెర్చ్‌ చేస్తోంది మైసూర్‌ కంపెనీ. దాదాపు 15వందల ఎకరాల్లో బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు జరుపుతోంది

ప్రస్తుతం టన్ను మట్టి నుంచి ఒకటిన్నర గ్రాముల బంగారం లభ్యమవుతోంది. టన్ను మట్టిలో బంగారం తీయడం కోసం సుమారు ఐదువేల రూపాయలు ఖర్చు చేస్తోంది జియా మైసూర్‌ కంపెనీ. ప్రస్తుతం పగిడిరాయి, జొన్నగిరి గ్రామాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల్లో విలువైన బంగారం లభిస్తోంది. ఒకవేళ మైసూర్‌ కంపెనీ అన్వేషణ ఫలిస్తే మాత్రం ఆ ప్రాంతం స్వర్ణసీమగా మారడం ఖాయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..