Pattu Saree Cake: అమలాపురంలో పట్టుచీర ఆకారంలో కేక్.. నిశ్చయ తాంబూలాల్లో ఆకట్టుకున్న పట్టుచీర కేక్ సారె

అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెళ్ళికొడుకు బంధువులు ఇచ్చిన ఈ పట్టుచీర కేక్ ను చూసేందుకు బంధువులు క్యూ కట్టారు. ఎంగేజ్ మెంట్ కు పెళ్లికూతురుని సప్రైజ్ చేయడానికి ప్రత్యేకంగా కేక్ పట్టుచీర సారెను తయారు చేయించారు. అమలాపురానికి చెందిన వైష్ణవి స్వీట్స్ లో 15వేల రూపాయలతో వేరైటీ గా తయారు చేయించారు. కేక్ పై నగలు, గాజులు, పసుపు, కుంకుమ బరిణి ఏర్పాటు చేసారు.

Edited By:

Updated on: Sep 07, 2023 | 12:02 PM

కోనసీమ ప్రకృతి అందాలకు, ఆతిథ్యానికే కాదు వెరైటీలకు కూడా మారుపేరుగా మారుతుంది. కొత్త అల్లుడుకి చేసే మర్యాదల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.. ఇక నిన్న రాజమండ్రి లో ఓ నిశ్చయ తాంబూలాల వేడుకలో 108 రకాల స్వీట్స్ తో సారి పెట్టి కోనసీమ ఆతిథ్యం చూపిస్తే ఈరోజు అమలాపురం లో ఎంగేజ్మెంట్ కు పట్టుచీర కేకు తయారు చేసి పెళ్లికూతురికి సర్ప్రైజ్ ఇచ్చిన పెళ్లి కుమారుడు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెళ్ళికొడుకు బంధువులు ఇచ్చిన ఈ పట్టుచీర కేక్ ను చూసేందుకు బంధువులు క్యూ కట్టారు.

ఎంగేజ్ మెంట్ కు పెళ్లికూతురుని సప్రైజ్ చేయడానికి ప్రత్యేకంగా కేక్ పట్టుచీర సారెను తయారు చేయించారు. అమలాపురానికి చెందిన వైష్ణవి స్వీట్స్ లో 15వేల రూపాయలతో వేరైటీ గా తయారు చేయించారు.

కోనసీమ అందాలను తలపించేలా పట్టు చీర కేక్ ను ఎరుపు రంగు అంచు, పచ్చ రంగు తో సుందరంగా ఉంది. అంతేకాదు అమ్మాయికి చీరతో పాటు నగలను పెట్టి ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తూ.. పట్టు చీర కేక్ మీద  అదనపు హంగులుగా బంగారు నగలు, గాజులు, నక్లెస్, కుంకుమ భరిణ వంటి వస్తువులను టాపింగ్  చేశారు. దీంతో ఈ పట్టు చీర ఏమో అన్నంత అందంగా కన్పిస్తూ కనువిందు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కేక్ పై నగలు, గాజులు, పసుపు, కుంకుమ బరిణి ఏర్పాటు చేసారు. పట్టు చీరతోపాటు, కోవతో కొబ్బరి బొండం, బత్తాయి పండ్లు, కమలా ఫలం వివిధ పండ్ల ఆకారంలో స్వీట్స్ తయారు చేయించారు. కాకినాడ లో జరగబోయే నిశ్చితార్థం కోసం అమ్మాయి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది ఈ పట్టు చీర కేక్ సారీ. గోదావరి జిల్లాలో ఏది చేసినా వేరైటికి మారు పేరుగా నిలిచే కోనసీమ జిల్లా ప్రజలు.. కోనసీమ ఆతిధ్యంలోను, ఆప్యాయత అనురాగంలోనూ తిరుగులేదని అనిపించుకొంటున్నారు కోనసీమ వాసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..