Andhra Pradesh: ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అమలు వాయిదా.. ఆ తేదీ నుంచి మాత్రం.. కారణమేంటంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై గతంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ అమలును వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధం అమలుకు సమయం..

Andhra Pradesh: ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం అమలు వాయిదా.. ఆ తేదీ నుంచి మాత్రం.. కారణమేంటంటే..
Andhra Pradesh

Updated on: Oct 31, 2022 | 9:36 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై గతంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ అమలును వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధం అమలుకు సమయం ఇవ్వాలన్న ఫ్లెక్సీ తయారీదారుల విన్నపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల తయారీదారులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అధికారులకు సూచించారు. అయితే.. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల రద్దును జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాగా.. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయిస్తూ.. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. నవంబరు 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది.

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ, బ్యానర్ల ఉత్పత్తి, దిగుమతితో పాటు ముద్రణ, వినియోగం, రవాణ, ప్రదర్శనలపై కూడా నిషేధం ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, పంచాయతీ అధికారులు, బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ, బ్యానర్లకు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వివరించారు. అయితే తాజాగా.. ఆ అమలు ఆదేశాలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..