కుర్చీలోనే కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి..టెస్టుల్లో బయటపడిన షాకింగ్ నిజం!

| Edited By: Phani CH

May 01, 2021 | 7:25 PM

ఏపీలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ మహమ్మారి ఎప్పుడు.. ఎవరిని.. ఎలా బలితీసుకుంటుందో ఎవరికీ అంతుబట్టడం..

కుర్చీలోనే కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి..టెస్టుల్లో బయటపడిన షాకింగ్ నిజం!
Follow us on

ఏపీలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ మహమ్మారి ఎప్పుడు.. ఎవరిని.. ఎలా బలితీసుకుంటుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అప్పటి వరకు బాగానే ఉంటున్న మనుషులు క్షణాల్లోనే విగతజీవులుగా మారుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జయశంకర్ నారాయణ ఆఫీసులోనే హఠాత్తుగా ప్రాణాలు కొల్పోయాడు. గత నాలుగు రోజులుగా జయశంకర్‌ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా, అలాగే ఆఫీసుకు వస్తున్నారు. ఏప్రిల్‌ 30న అతడు యధావిధిగా విధులకు హాజరయ్యారు. ఇంతలోనే కూర్చున్న కుర్చీలోనే వెనక్కి తూలిన ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు.

కాసేపటి తర్వాత గమనించిన కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వెంటనే పోలీసులు, వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది మృతదేహనికి పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నారాయణతో కలిసి పనిచేసిన సహోద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!