Andhra Goli Soda: నువ్వు విజిలేస్తే ఆంధ్రా ‘సోడా’ బుడ్డి.. గోలి సోడాకు పెరిగిన డిమాండ్.. హిస్టరీ ఏంటో మీకు తెలుసా..?

|

Jun 18, 2023 | 8:27 PM

Andhra Goli Soda: ఎప్పుడో చిన్నప్పుడు బడ్డీ కొట్లల్లో, సినిమా హాల్స్, బస్‌స్టాండ్‌ల దగ్గర.. ఇంకా చెప్పాలంటే సాయంత్రం పూట రెండు చెక్రల చెక్కబండిపై మన బజారుకు వచ్చే గోలి సోడా కనిపించే రోజులు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది..

Andhra Goli Soda: నువ్వు విజిలేస్తే ఆంధ్రా ‘సోడా’ బుడ్డి.. గోలి సోడాకు పెరిగిన డిమాండ్.. హిస్టరీ ఏంటో మీకు తెలుసా..?
Goli Soda
Follow us on

Andhra Goli Soda: ఎప్పుడో చిన్నప్పుడు బడ్డీ కొట్లల్లో, సినిమా హాల్స్, బస్‌స్టాండ్‌ల దగ్గర.. ఇంకా చెప్పాలంటే సాయంత్రం పూట రెండు చెక్రల చెక్కబండిపై మన బజారుకు వచ్చే గోలి సోడా కనిపించే రోజులు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.. అలాంటి గోలి సోడా.. అంటే సాధారణ ప్రజల కూల్ డ్రింక్‌ కనుమరుగవుతూ వచ్చింది. తాగుదామన్న.. కనీసం చూద్దామన్నా కొన్నేళ్ల నుంచి అరుదుగా కనిపించాయి. దాదాపు పది.. పదిహేనేళ్ల తర్వాత ఈ గోలి సోడా మళ్లీ మార్కెట్‌లోకి ఫుల్‌ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా రూపాయి నుంచి ఏకంగా 30 రూపాయల ధరతో కార్పొరేట్‌ అంటే పెద్ద మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.. ధర ఎంత పెరిగిన గోలి సోడా కొట్టుకుని తాగాలని తపన ముందు.. రేట్లు పట్టించుకోవట్లేదు ప్రజలు.. సాధారణంగా కూల్‌ డ్రింక్‌ తాగాలంటే.. 20 నుంచి 40 రూపాయాల ధర ఉంటుంది.. దానికి బదులు.. చాలామంది సోడా బుడ్డి తాగుతూ.. ఈ ఎండల్లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి.. అనే సింహాద్రి సినిమాలోని పాట ఎంత పాపులరో.. ఒకప్పటి గోలి సోడా కూడా అంతే ఫేమస్. వేసవి తాపాన్ని తగ్గించే ఈ సోడాలు ఈ మధ్య కాలంలో నగరంలో దర్శనమిస్తున్నాయి. అప్పట్లో రూపాయి కే దొరికే ఈ సోడాలు ఇప్పుడు 20 నుండి 30 రూపాయలకు అమ్ముతున్నా చాలా క్రేజీగా ఫీల్ అవుతూ తాగుతున్నారు.

1968 లో వచ్చిన లక్ష్మీ నివాసం” చిత్రం లో పద్మనాభం అభినయిస్తూ పాడిన “సోడా.. సోడా.. ఆంధ్రా సోడా .. గోలి సోడా జిల్ జిల్ సోడా” పాట గుర్తుందా.. మన పిఠాపురం నాగేశ్వర రావు పాడగా కొసరాజు సాహిత్యం అందించారు. ఆ పాటలో రెండు చక్రాల బండి కూడా ఇప్పటి నెమరు వేసుకుంటున్నారు ఆ పాత తరం వారు..

ఇవి కూడా చదవండి

ఈ సోడా ని, హిందీ వాళ్ళు బాంట లేదా కాంచే వాలి బాటిల్ అంటారు. “కాంచే” అంటే గోళీ అని అర్ధం. ఒకప్పుడు ఇవి అన్నీ బడ్డీ కొట్టులో, కోకాకోలా, మజాల స్థానం లో దర్జాగా కూర్చుని ఉండేవి. ఇప్పుడు పెద్ద పెద్ద మల్టీ ఫ్లెక్సీలు, హోటళ్ళు షాపింగ్ మాల్స్ దగ్గర దర్శనమిస్తున్నాయి.. అంటే సోడా స్థాయి ఏ రేంజ్‌లో పెరిగిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

Goli Soda

ఈ గోలి సోడా కి పెద్ద హిస్టరీనే ఉంది..

దీనిలో వాడే సీసా పేరు “కాడ్ నెక్ బాటిల్ అని పేరు.. ఇవి అసలు చాలా దేశాలలో తయారీయే మానుకున్నారు. 1872 లో లండన్ వాసి హీరామ్ కాడ్ అనే వ్యక్తి ఒక బాటిల్ తయారు చేసి పేటెంట్ కూడా పొందాడు. ఆ కాలంలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. మామూలు సీసాకి రెండు నొక్కులు ఉండే ఈ నమూనా లో గొప్పతనం ఏమంటే, ఒక నొక్కులో ఉండే గోళీ, అదే సీసాకు, మూతలా బిగుసుకు పోగలగటం. అయితే, ఒకసారి ఓపెన్ అయ్యాక, ఆ గోళీ, ఇంకో నొక్కులో ఇరుక్కుని తాగేటప్పుడు అడ్డుగా ఉండకుండా ఉండగలగటం దీని ప్రత్యేకత. తర్వాతి కాలంలో ఎంతో పాపులర్ అయిన ఈ సీసాకి, అంచులో ఉన్న, రబ్బరు వాషర్ వత్తిడి పెంచినపుడు, గోళీని గట్టిగా పట్టుకుని, మూత అవసరం లేకుండా, మన్నికని ఇస్తుంది. బ్రిటీషు వారు వెళ్తూ వెళ్తూ, ఇలాంటి సీసా తయారీ ఫేక్టరీని అమ్ముతుంటే, ఉత్తర ప్రదేశ్ లోని ససాని లో ఖండేల్ వాల్ గ్లాస్ వర్క్స్ వారు, కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారే మనకు ఈ బాటిల్ కి, అతిపెద్ద సరఫరా దారులు. వీరు కాక, హైదరాబాద్ లో, మహా లక్ష్మీ గ్లాస్ వర్క్స్ వారు కూడా, ఇలాంటి వాటిని చేసేవారు.

ఏదేమైనా అప్పటి పాత గోలి సోడా కొత్త కొత్త బ్రాండ్ నేమ్స్ తో రకరకాల ఫ్లవర్స్‌తో మళ్లీ ఇప్పుడు మార్కెట్‌లో హల్చల్ చేస్తుంది.. యువత కూడా ఎంతో సంబరంగా గోలీ సోడాను తాగుతున్నారు.. మోటర్నైజేషన్‌లో కూడా పాత తరం వాటికి పాపులారిటీ అలాగే ఉంటుంది అనే వాటిలో ఈ ఆంధ్రా గోలి సోడా ఉండడం ఒక విశేషమే.

-విక్రమ్, టీవీ9 రిపోర్టర్, విజయవాడ..

మరిన్ని ఏపీ వార్తల కోసం..