Srikakulam District: సముద్రతీరానికి కొట్టుకువచ్చిన రథం మిస్టరీ వీడింది.. ఇవిగో వివరాలు

| Edited By: Anil kumar poka

May 11, 2022 | 4:33 PM

సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ స్వర్ణ రథం కొట్టుకొచ్చింది. దీంతో తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఈ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఈ రథం మెరిసిపోతోంది. దీని మిస్టరీ దాదాపు వీడిపోయింది.

Srikakulam District: సముద్రతీరానికి కొట్టుకువచ్చిన రథం మిస్టరీ వీడింది.. ఇవిగో వివరాలు
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న స్వర్ణ రథం
Follow us on

బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అసని తుఫాన్(Cyclone Asani) తీరప్రాంతాల్లో భారీ వర్షాన్ని తీసుకువచ్చింది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సంతబొమ్మాళి మండలం M.సున్నాపల్లి సముద్రతీరానికి ఒక వింత వాహనం కొట్టుకువచ్చింది. దేవుడి ఊరేగింపులో ఉపయోగించే వాహనం తరహాలో ఇది కనిపిస్తోంది. బంగారు వర్ణంతో ధగధగలాడుతూ ఉండటంతో దీన్ని చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఇది నిజంగా బంగారదేమోనని భ్రమ కలిగించేలా ఉంది. జనం ఎగబడుతుండటంతో దీనికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఇది మయన్మార్‌ నుంచి కొట్టుకువచ్చినట్టుగా నిర్థారణకు వచ్చారు. మయన్మార్‌లో ఎవరైనా యువతీయువకులు బౌద్ధమతంలో చేరి సన్యాసం స్వీకరించే సమయంలో భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. యువతీ యువకులను ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాల్లో ఊరేగిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకువచ్చిన వాహనం కూడా ఇలాగే కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. కాని ఇది పెద్దగా కనిపిస్తోంది. ఊరేగింపు నిర్వహించిన తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారు. ఈ వాహనంపై జనవరి 16 అనే తేదీ కూడా కనిపిస్తోంది. అంటే దీన్ని నాలుగు నెలల క్రితమే రూపొందించి ఉంటారు. అందుకే అది కొత్తగా కనిపిస్తోంది. ఈ వాహన రూపురేఖలు డిజైన్స్‌ అంతా కూడా బౌద్ధమతం థీమ్‌లో ఉంది.

మూడు నెలల క్రితం కూడా ఇలాంటి వాహనం ఒకటి నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతానికి కొట్టుకువచ్చింది. కాని అది చాలా పాతగా కనిపించింది. అందులో బుద్ధుడి ప్రతిమ, చిత్రంతో పాటు శివలింగం కూడా ఉంది.