Andhra Pradesh: దారుణం.. స్కూల్లో బాలికపై కన్నేసిన అటేండర్‌.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

Visakhapatnam News: ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కన్నేసిన స్కూల్‌ అటేండర్‌.. దారుణానికి పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆతర్వాత బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Andhra Pradesh: దారుణం.. స్కూల్లో బాలికపై కన్నేసిన అటేండర్‌.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
Rape case

Updated on: Jul 10, 2023 | 6:00 PM

Visakhapatnam News: ఏపీలోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కన్నేసిన స్కూల్‌ అటేండర్‌.. దారుణానికి పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆతర్వాత బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు కూడా. సంచలనంగా మారిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు విశాఖ పోలీసులు. అటు.. కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు రోడ్డెక్కి నిరసనకు దిగాయి. దీంతో వైజాగ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖ ఎయిర్‌పోర్ట్ పీఎస్ పరిధిలో ఓ నేవీ ఉద్యోగి కూతురు.. ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇంటి దగ్గరే ఉంటున్న సత్యరావు స్కూల్లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా లైంగికదాడికి బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ, ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గుర్తించిన తల్లి.. ఏమైనందని ప్రశ్నిస్తే ఆసలు విషయం బయటపడింది.

కన్నకూతురిపై జరిగిన ఘాతుకం గురించి విని చలించిపోయిందా తల్లి. ఫిర్యాదు తీసుకుని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దిశ పిఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. బాధితురిలిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌లో చేర్చారు. అటు.. కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు రోడ్డెక్కి నిరసనకు దిగాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతానికి నిందితుడు సత్య రావును అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించినట్లు దిశ ఏసీబీ వివేకానంద తెలిపారు. అతని సెల్‌ ఫోన్‌ సిజ్ చేసి ల్యాబ్ కు పంపించామని.. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే దానిపై విచారిస్తున్నామని తెలిపారు. బాలిక కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం..