Andhra: ఏముంది.. అక్కడంతా చెత్తేగా అనుకోకండి.. పొరపాటున కాలు పెడితే ఖేల్ ఖతం..

విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన రైతు సింహాచలం తన తోటలో రోజువారీ పని చేస్తుండగా పొదల నుంచి అకస్మాత్తుగా కదలికలు గమనించాడు. మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నాడు. కానీ అది పొదల మధ్య నుండి పొలంలోకి రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. సుమారు 12 అడుగుల పొడవున్న...

Andhra: ఏముంది.. అక్కడంతా చెత్తేగా అనుకోకండి.. పొరపాటున కాలు పెడితే ఖేల్ ఖతం..
Python

Edited By: Ram Naramaneni

Updated on: Nov 21, 2025 | 11:55 AM

విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన రైతు సింహాచలం తన తోటలో రోజువారీ పని చేస్తుండగా పొదల నుంచి అకస్మాత్తుగా కదలికలు గమనించాడు. మొదట ఏదో సాధారణ జంతువు అనుకున్నాడు. కానీ అది పొదల మధ్య నుంచి పొలంలోకి రావడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. సుమారు 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ తోటలో నెమ్మదిగా సంచరిస్తుంది. కొండచిలువను చూసిన సింహాచలం వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపట్లోనే అక్కడికి చేరిన రైతులు, పొలాల్లో పని చేస్తూ అటుగా వెళ్తున్న మహిళలు కొండచిలువను చూసి భయపడి దూరంగా నిలబడ్డారు. దాని వైపు ఎవరూ వెళ్లకుండా, ఎలాంటి ప్రమాదం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలోని స్నేక్ రిస్క్యూ టీంకు సమాచారమిచ్చారు.

అటవీశాఖ సూచనల మేరకు స్నేక్ క్యాచర్ శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే కొండచిలువ ఎలాంటి భయానక పరిస్థితి కలిగించకుండా నెమ్మదిగా సంచరిస్తూనే ఉంది. దీంతో దాన్ని గమనించిన స్నేక్ క్యాచర్ తన వద్ద ఉన్న ప్రత్యేకమైన పరికరాల సహాయంతో జాగ్రత్తగా బంధించాడు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువను పట్టుకున్న అనంతరం స్నేక్ క్యాచర్ శేఖర్.. దాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఉండే మైదాన ప్రాంతంలోని సురక్షిత అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే ఈ ప్రాంతంలో తమకు తరచూ పాములు, కొండచిలువులు కనిపిస్తున్నాయని పొలం పోవాలంటేనే హడలిపోతున్నామని అంటున్నారు రైతులు. అయితే పాములు కనిపిస్తే తమ సమాచారం ఇవ్వాలని వాటికి ఎలాంటి ప్రమాదం తలపెట్టవద్దని, తగు జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు అటవీశాఖ అధికారులు.