Gangavva: తప్పుగా అనుకోవద్దు సార్.. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ.. ఎందుకంటే..

|

May 24, 2023 | 12:53 PM

గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు మళ్లీ జీవం పోస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచుతులయ్యారు. అంతేకాకుండా, బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె మాటలు.. పాటలకు జనం ఫిదా అవుతుంటారు. అలాంటి గంగవ్వ.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పారు.

Gangavva: తప్పుగా అనుకోవద్దు సార్.. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ.. ఎందుకంటే..
Chandrababu Gangavva
Follow us on

గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు మళ్లీ జీవం పోస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచుతులయ్యారు. అంతేకాకుండా, బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె మాటలు.. పాటలకు జనం ఫిదా అవుతుంటారు. అలాంటి గంగవ్వ.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అరే.. అదేంటి.. గంగవ్వ చంద్రబాబుకి క్షమాపణలు చెప్పడమేంటి.. అని ఆలోచిస్తున్నారా..? అయితే, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఉగాది పర్వదినం సందర్భంగా ఓ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో గంగవ్వ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా.. ఛానెల్ వారు సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను గంగవ్వతో చెప్పించారు. ఈ క్రమంలో ఛానెల్ ప్రతినిధి చంద్రబాబు, లోకేష్ ఫొటోలు చూపించి.. ఈ నాయకుల జాతకం ఎలా ఉంటుందో చెప్పాలంటూ అడిగారు.. దీంతో గంగవ్వ వారి పేర్లు చెప్పి.. జాతకలను తాను చెప్పనంటూ లేస్తుంది.. ఛానెల్ ప్రతినిధి మళ్లీ ప్రశ్నించగా.. ‘‘చంద్రబాబుకు గ్రహణం పట్టింది’’ అంటూ గంగవ్వ చెబుతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గంగవ్వ చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడిన వీడియోను కొందరు నెట్టింట వైరల్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో.. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, గంగవ్వ మళ్లీ తెరపైకి వచ్చి.. అప్పుడు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్నట్టు చెప్పారు. టీవీ ఛానెల్ వాళ్లు అనమంటేనే అన్నానని.. తప్పుగా అనుకోవద్దు అంటూ పేర్కొన్నారు. మాట జారితే.. క్షమించండి అంటూ.. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి క్షమాపణలు కోరారు. అయితే, గంగవ్వ క్షమాపణలు చెప్పిన వీడియోను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..