ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో వరసగా జరుగుతున్న అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. విజయవాడ, రేపల్లె ఘటనలు మరవకముందే నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సొంత జిల్లా వైఎస్ఆర్(YSR) లో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో ఓ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిపి 10 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా పదే పదే అత్యాచారం చేయడంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయం పోలీసులకు తెలిసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఘటనపై కనీసం కేసు నమోదు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం మసీదు వద్ద ఓ మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఆమె తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. అదే వీధిలో ఓ దుకాణంలో పనిచేస్తున్న చెంబు అనే యువకుడు ఆ బాలికపై కన్నేశాడు. చెంబు, అతని స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాలిక చెప్పిన సమాచారాన్ని పోలీసులు వీడియో తీసి, సీఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సదరు సీఐ.. ఈ విషయం బయటకు రాకుండా బాధితురాలిని గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చే అమృతనగర్‌లోని ఓ ఆశ్రమానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులూ కేసు నమోదు చేయకుండా, బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు తరలించారు.
పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిందితులను పట్టుకోకుండా బాధితురాలిని స్వచ్ఛంద సంస్థకు తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. స్థానికుల నుంచి బాలికపై అత్యాచార ఘటన తమ దృష్టికి వచ్చిందన్న ప్రొద్దూటూరు డీఎస్పీ.. విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Viral Video: కలెక్టరేట్‌లో ఒక్కసారిగా గందరగోళం.. ఏం జరిగిందని చూడగా షాకింగ్ సీన్!
HUL: వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు బ్రిడ్జ్ ప్యాక్ విధానాన్ని అమలు చేయనున్న హెచ్‌యూఎల్..