Bank Robbery: బ్యాంకు చోరీకి దొంగల ముఠా విఫలయత్నం! వాచ్‌మెన్‌ను తాళ్లతో కట్టి.. ఆ తర్వాత

| Edited By: Srilakshmi C

Nov 08, 2023 | 5:32 PM

అనకాపల్లి జిల్లాలో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం జరిగింది. కసింకోట మండలం, నర్సింగబిల్లి గ్రామం 'ది నర్సింగబిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ సొసైటీ బ్యాంబ్‌'లో దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు అగంతకులు బ్యాంకులోకి చొరబడ్డారు. అక్కడ కాపలాగా ఉన్న వాచ్‌మెన్ను తాళ్లతో బంధించారు. లాకర్ గది వరకు వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుంచి..

Bank Robbery: బ్యాంకు చోరీకి దొంగల ముఠా విఫలయత్నం! వాచ్‌మెన్‌ను తాళ్లతో కట్టి.. ఆ తర్వాత
Bank Robbery
Follow us on

అనకాపల్లి, నవంబర్‌ 8: అనకాపల్లి జిల్లాలో బ్యాంకు దోపిడి దొంగలు హల్చల్ చేస్తున్నారు. బ్యాంకులను టార్గెట్ చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒక దోపిడీ కేసు చేధించక ముందే.. మరో బ్యాంకులోకి చొరబడ్డారు. తాజాగా బ్యాంకు వాచ్‌మెన్‌ను తాళ్లతో బంధించి, బయోత్పాతం సృష్టించారు. అసలేం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లాలో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం జరిగింది. కసింకోట మండలం, నర్సింగబిల్లి గ్రామం ‘ది నర్సింగబిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ సొసైటీ బ్యాంబ్‌’లో దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు అగంతకులు బ్యాంకులోకి చొరబడ్డారు. అక్కడ కాపలాగా ఉన్న వాచ్‌మెన్ను తాళ్లతో బంధించారు. లాకర్ గది వరకు వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఉన్నారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. వాళ్లు పగలగొట్టేందుకు యత్నించిన లాకర్‌లో కోట్ల రూపాయల బంగారం ఉంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం స్పాట్లో ఆధారాలను సేకరించింది.

ఆ ఘటన మరిచిపోకముందే..

గతంలో ఇదే నర్సింగపల్లి గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంకులో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. హెల్మెట్ తో ఓ దుండగుడు చొరబడి గన్‌తో బెదిరించి.. 15 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఆ ఘటన మరువకముందే మరో బ్యాంక్ చోరీకి విఫలయత్నం జరగడంతో పోలీసులు పరుగులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.