Tadepalligudem: పండుగ పూట విషాద వార్త.. చేపల లారీ బోల్తా..నలుగురు దుర్మరణం

పండుగ పూట విషాద వార్త.  పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు దుర్మరణం చెందారు.

Tadepalligudem: పండుగ పూట విషాద వార్త.. చేపల లారీ బోల్తా..నలుగురు దుర్మరణం
Lorry Accident

Updated on: Jan 14, 2022 | 8:52 AM

AP Road Accident: ఏపీలో పండుగ పూట విషాద వార్త.  పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే  నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైజాగ్ నుంచి లోడుతో నారాయణపురం వస్తుండగా తాడేపల్లిగూడెం వద్ద ఘటన జరిగింది. మృతులు బీహార్ కి చెందిన వారుగా గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ మద్యం మత్తే  కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

 

Also Read:  ‘అమ్మా నేనెట్టా బ్రతికేది’.. తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానవాటికలో తనయుడు ఆత్మహత్య

అక్క ఆడపడుచుతో ప్రేమలో పడ్డ యువతి.. చివరికి ఊహించని ట్విస్ట్