డాబాలో భోజం చేస్తూ క్యాష్ బ్యాగ్ మర్చిపోయిన వ్యక్తి.. కాసేపటికే పోలీసుల ఎంట్రీ.. యజమానికి ఏం చేశాడంటే..
ఈ మధ్య కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మతి మరుపు. ఇంటి నుంచి బయటకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి నుంచి తీసుకువెళ్లిన వస్తువు ఏదో ఒకటి బయట మరిచిపోయి రావటం పరిపాటి అవుతుంది. ఇలాంటి ఘటనే విజయవాడలో నివాసం ఉండే గురుగుబెల్లి పృథ్వీరాజ్ అనే వ్యక్తి విషయంలోను జరిగింది. అతను మరిచిపోయింది ఏంటో తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది.

ప్రతి మనిషకి మతిమరుపు ఉండడం సహజం.. ఈ మతిమరుపు కారణంగా ఎక్కడో అక్కడ ఏదో ఒకటి మనం మర్చిపోతూ ఉంటాం. అయితే ఇక్కడో వ్యక్తి మాత్రం చిన్నచితక వస్తువును మరిచిపోలేదు. ఓ దాబాలో భోజనం చేసి అక్కడ ఏకంగా రూ. 1,70,800ల నగదు మరిచిపోయాడు. అయితే చాలా సేపటి తర్వాత ఆ విషయం అతని గుర్తొచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోయాయనుకున్న అతని డబ్బును క్షేమంగా తెచ్చి ఇచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుమారు 6.25 గంటలకు డయల్ 112కు గురుగుబెల్లి పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తన సమస్యను తెలిపాడు. వ్యక్తిగత పనుల కోసం విజయవాడ నుంచి శ్రీకాకుళం వచ్చిన అతను తిరిగి విజయవాడకు వెళ్తూ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస దాటి రాయపాడు దగ్గర ఉన్న ఒక దాబాలో భోజనం చేసి తరువాత అతని ప్రయాణం కొనసాగించాడు. అయితే దాబాలో భోజనం చేసే సందర్భంలో తన వద్ద ఉన్న రూ. 1,70,800/- క్యాష్ ఉన్న బ్యాగ్ ను దాబాలో మరిచిపోయాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చేరుకునే సరికి నగదు ఉన్న బ్యాగ్‌ను దాబాలో మర్చిపోయినట్లు గుర్తించాడు.
అయితే అప్పటికే చాలా దూరం ప్రయాణించటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. వెంటనే ఆయన బుర్రలో ఓ ఐడియా వచ్చింది. వెంటనే డయల్ 112కు సమాచారం ఇచ్చాడు పృథ్వీరాజ్ నుంచి సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ఆముదాలవలస పోలీసు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో గాలింపు నిర్వహించి ఎట్టకేలకు బ్యాగ్‌ను గుర్తించారు. అందులోని అతని చెప్పి డబ్బు మొత్తం ఉందా లేదా అని చెక్ చేశారు. అంతా అలానే ఉండడంతో వెంటనే దాన్ని పీఎస్‌కు తీసుకెళ్లి బాధితుడికి సపమాచారం ఇచ్చారు.
దీంతో పీఎస్‌కు వచ్చిన పృథ్వీరాజ్ ఎస్సై బాలరాజు సమక్షంలో నగదు బ్యాగ్‌ను అందించారు పోలీసులు. పోయాయనుకున్న డబ్బులు తిరిగి రావటంతో పృధ్వీరాజ్ ఫుల్ ఖుషీ అయ్యాడు. సదురు సిబ్బందిని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అభినందించారు. పోలీసు శాఖకు డయల్ 112 ద్వారా వచ్చే ప్రతి కాల్‌ను అత్యవసరంగా పరిగణించి ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
