Ongole: తన కార్యాలయం ముందే నిరాహార దీక్ష చేపట్టిన ఈఈ.. ఎందుకో తెల్సా..?
ఒంగోలు ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం ముందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. విధుల్లో చేరి కొంతకాలమే అయినా, తన భద్రతపైనే అనుమానాలు కలిగించే పరిస్థితులు నెలకొన్నాయని, ఉన్నతాధికారులకు పలుమార్లు తెలిపినా స్పందన రాకపోవడంతో గాంధేయమార్గంలో నిరసనకు దిగినట్టు తెలిపారు.

గ్రామీణ నీటి పారుదల శాఖలో ఆయనో ఉన్నతాధికారి. ఒంగోలు ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. ఆయన విధుల్లో చేరి రెండు నెలలైంది. అయితే రామాజంనేయులు అనే కాంట్రాక్టర్ తనకు గతంలో రావాల్సిన బిల్లులు మంజూరు చేయాలని బెదిరింపులకు దిగుతున్నాడట. ఫోన్ చేసి చంపేస్తానని, తన బిల్లులు మంజూరు చేయకుంటే ఫీల్డ్‌లో ఎలా తిరుగుతావో చూస్తానని హెచ్చరించాడట. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పరిస్థితి ఇలాగే ఉంటే తనను కాంట్రాక్టర్ చంపేస్తాడన్న భయం వెంటాడుతోందని ఆ ఉన్నతాధికారి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తనకు కాంట్రాక్టర్ నుంచి ప్రాణహాని ఉన్నందున అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఒంగోలులోని తన కార్యాలయం ముందే నిరసన దీక్ష చేపట్టారు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారం కాస్తా రచ్చకెక్కడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఉద్యోగుల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఒంగోలులోని ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం ముందు ఈఈ నాగేశ్వరరావు నిరసన దీక్ష చేపట్టారు. ఓ కాంట్రాక్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు ఎస్ఈ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తనను ఫోన్లో చంపుతానని బెదిరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ రామాంజనేయులు అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి తనకు చెందిన పాత బిల్లులు మంజూరు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన ప్రాణ రక్షణ కోరుతూ నిరసన దీక్ష చేపట్టినట్టు ఈఈ నాగేశ్వరరావు తెలిపారు. తాను ఎక్కువగా ఫీల్డ్‌లో డ్యూటీ చేయాల్సి వస్తుందని, అలాంటిది తన బిల్లులు మంజూరు చేయకపోతే ఎలా తిరుగుతావో చూస్తానంటూ కాంట్రాక్టర్ బెదిరిస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో గాంధేయమార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. తనకు కాంట్రాక్టర్ రామాంజనేయులు నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై విచారణ చేపట్టేందుకు వచ్చిన ఆర్‌డబ్ల్యుఎస్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ స్పందిస్తూ తమ శాఖ ఉద్యోగి, కాంట్రాక్టర్ మధ్య గల వివాదంపై ప్రస్తుతం విచారణ సాగుతుందని, త్వరలో పరిష్కరిస్తామని చేస్తామని చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ తెలిపారు. ఈ వ్యవహారం ఆర్‌డబ్ల్యుఎస్ ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
