పండగ చేస్కోండి. కానీ సరుకులు ,స్వీట్లు కొనేప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి. కలర్స్‌కు టెంప్టయి స్వీట్లు కొంటే హెల్త్‌కు రంగుపడ్డం ఖాయం. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అలాంటి చేదు నిజాలు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నగర వ్యాప్తంగా స్వీట్ హౌస్‌లు.. హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారు. షాప్‌లతో పాటు స్వీట్లు తయారు చేసే ఖార్ఖనాల్లో చెకింగ్స్ నిర్వహించారు. బేకారీలను తనిఖీ చేస్తే అక్కడి బేకార్ పరిస్థితి బయటపడింది. శుచి శుభ్రత సరికదా..నిబంధనలకు విరుద్ధంగా కలర్స్ వాడుతున్నట్టు తేలింది. కొందరు ఎక్సైపరీ డేట్ లేకుండా ఫుడ్ ప్యాక్ చేసి విక్రయిస్తుంటే..మరికొందరు లైసెన్స్‌లు లేకుండా దందా చేస్తున్నట్టు గుర్తించారు ఫుడ్ సేప్టీ అధికారులు.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
జిల్లా కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమీషనర్ ఆదేశాలతో ఐదు టీమ్‌లు స్పెషల్ రెయిడ్స్ చేపట్టాయి. నోరిరించే స్వీట్ల తయారీ వెనుక ప్రజారోగ్యానికి ఎసరు పెడుతోన్న నిర్వాకలు బయటపడ్డాయి తనిఖీల్లో. అదీ సంగతి. కలర్‌ఫుల్ స్వీట్లు క్యాన్సర్ కారకాలు. శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయన్నారు. బడా మాల్ ..చోటా మాల్.. షాప్ ఏదైనా సరే పండగ వేళ ఇంత గోల్‌మాల్ జరుగుతోంది. రంగులు చూసి స్వీట్లు కొనడం అంటే..డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకోవడమే. సో..జరభద్రం బీకేర్‌ఫుల్.
ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి