Andhra Pradesh: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన పదో తరగతి బాలిక.. విషయం తెలిసి షాక్!
బనగానపల్లె మండలం కైప గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలిక.. మగ శిశువుకు జన్మనిచ్చింది. అదే గ్రామానికి చెందిన యువకుడు.. అమ్మాయిని మాయ మాటలు చెప్పి.. లైంగికంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. విషయం బయటకు పొక్కడంతో కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చట్టాలు మారుతున్న మహిళలు,పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట ఆడవారిపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామంలో చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు గర్భవతిని చేశాడు. చివరకి ఆ బాలిక ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. కైప గ్రామానికి చెందిన యువకుడు మనోహర్(21) అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను వలలో వేసుకున్నాడు. రోజు ఇంటికి దగ్గర వచ్చే బాలికను.. మాయమాటలు చెబుతూ.. మెల్లగా తన వైపు మలుచుకున్నాడు.బాలికను మాటలతో మభ్య పెట్టాడు ఇంట్లోకి తీసుకువెళ్లి.. సంవత్సర కాలంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అయితే కూతురుకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు బాలికకు వైద్య పరీక్షలు చేసి, గర్భవతి అని నిర్ధారించారు. తొమ్మిది నెలల తర్వాత బాలికకు డెలివరి చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
