AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రూ. 2లకే బ్రాండెడ్ టీ షర్ట్.. రూ. 49కే ఫ్యాంట్.. ఎగబడ్డ జనం.. చివరికి..!

రెండు రూపాయలకు మార్కెట్‌లో మంచి చాక్లెట్ కూడా రాదు.. ఆలాంటిదీ రెండు రూపాయలకి వంటి మీద వేసుకునే బ్రాండెడ్ టీ షర్ట్ వస్తుందా..? కచ్చితంగా రాదనే సమాధానం వస్తుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యాపార అభివృద్ధి కోసం కస్టమర్లను వెర్రి వాళ్ళను చేస్తున్నారు కొందరు. కేవలం రెండు రూపాయలకే బ్రాండెడ్ టీ షర్ట్.. కేవలం 49 రూపాయలకే బ్రాండెడ్ ఫ్యాంట్ అంటూ పబ్లిసిటీ ఇచ్చాడు ఒక షాప్ ఓనర్.

కేవలం రూ. 2లకే బ్రాండెడ్ టీ షర్ట్.. రూ. 49కే ఫ్యాంట్.. ఎగబడ్డ జనం.. చివరికి..!
Special Offer In Nellore
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 17, 2025 | 11:25 AM

Share

రెండు రూపాయలకు మార్కెట్‌లో మంచి చాక్లెట్ కూడా రాదు.. ఆలాంటిదీ రెండు రూపాయలకి వంటి మీద వేసుకునే బ్రాండెడ్ టీ షర్ట్ వస్తుందా..? కచ్చితంగా రాదనే సమాధానం వస్తుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యాపార అభివృద్ధి కోసం కస్టమర్లను వెర్రి వాళ్ళను చేస్తున్నారు కొందరు. కేవలం రెండు రూపాయలకే బ్రాండెడ్ టీ షర్ట్.. కేవలం 49 రూపాయలకే బ్రాండెడ్ ఫ్యాంట్ అంటూ పబ్లిసిటీ ఇచ్చాడు ఒక షాప్ ఓనర్. ఇక సోషల్ మీడియా లో ప్రకటన చూసిన వాళ్ళు ఆగుతారా..! తెల్లారేసరికల్లా షాపు ముందు వాలి పోయారు. వేలాది మంది తరలివచ్చారు. ఇంతకూ అసలు షాపు ఓనర్ 2 రూపాయలకే టీ షర్ట్ 49లకే ప్యాంట్ ఇచ్చారా..?

దుస్తులపై ఆఫర్లు ప్రకటిస్తే అవసరం లేకపోయినా ఆఫర్ ప్రకటించారని కొనే జనానికి మన దేశంలో కొదవే లేదు. కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేస్తే ప్రారంభ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. 10 రూపాయలకే చీర అని, 50 రూపాయలకే షర్ట్ అని, 100 రూపాయలకే బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్ అని కొత్తగా క్లాత్ షోరూం పెట్టే ఓనర్లు విపరీతాలకు పోతుంటారు. ఒకరిద్దరికి ఇచ్చి.. మిగిలిన వాళ్లకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని చెప్పి చేతులు దులుపేసుకుంటారు.

ఏపీలోని నెల్లూరులో ఈ తరహా ఘటనే జరిగింది. రెండు రూపాయలకే టీ షర్ట్, రూపాయికే బట్టలు అని ఫుల్ పబ్లిసిటీ చేశారు. సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రచారం చేశారు. దీంతో నెల్లూరు సిటీలో జనం ఆ కొత్తగా పెట్టిన బట్టల షాప్ ముందు క్యూ కట్టారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. ఆ షాప్ ఓనర్లు షెట్టర్ దించేశారు. షాప్ ఓపెనే చేయలేదు. అసలు బట్టలు ఒక్కరికి అయినా ఇచ్చారా అని కస్టమర్లు మండిపడ్డారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాజమాన్యం అసత్య ప్రచారాలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నెల్లూరు నగరంలోని నిప్పో సెంటర్ దగ్గర పుట్టవీధి మెయిర్ రోడ్‌లో ఆర్‌జేఆర్ హెర్బల్ క్లినిక్ బిల్డింగ్‌ పైన ఆరోన్ గార్మెంట్ పేరుతో కొత్తగా ఒక బట్టల కొట్టు పెట్టారు. ప్రారంభ ఆఫర్ కింద.. రూపాయికే టీ షర్ట్, రెండు రూపాయలకు ప్యాంట్ అని ఇన్‌‌స్టాగ్రాంలో, సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. అసత్య ప్రచారం చేయడంతో కృష్ణాష్టమి పండగ పూట జనం షాప్ ముందు పడిగాపులు కాశారు. ఆరోనా గార్మెంట్ దగ్గర జనాలు గుమిగూడారు. అక్కడ జనాలు పోగవడం చూసి ఆ దారిన వెళ్లే వాళ్లు ఏం జరిగిందోనని ఆగారు.

ఇలా.. ఫుల్ క్రౌడ్‌తో రోడ్డు నిండిపోయింది. విషయం తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతమంది జనం వచ్చేసరికి నష్టపోతాడనే భయంతో ఇవ్వలేదో మరేదైనా కారణం ఉందో గానీ అలాంటి ఆఫర్ ఏం లేదని తేలిపోయింది. క్లాత్ షాప్ ఓనర్ ఫేక్ క్యాంపెయిన్ కారణంగా గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చిందని కొందరు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొందరు మాత్రం బట్టల దుకాణం తెరుచుకుంటుందేమోనని ఆశగా అక్కడే ఎదురు చూస్తూ ఉండిపోయారు. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..