విజయవాడలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం
విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల ఫ్యాక్టరీ సమీపంలోని ప్రసాద్ థియేటర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Vijayawada Fire Accident: విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల ఫ్యాక్టరీ సమీపంలోని ప్రసాద్ థియేటర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో దాదాపు రూ.46.55 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Prasad Theater fire AccidentPrasad Theater VijayawadaVijayawada Fire AccidentVijayawada Fire Accident NewsVijayawada Fire Accident updates