Visakhapatnam: ఎంపీ సత్యనారాయణ సమక్షంలో కొట్టుకున్న వైసీపీ నేతలు.. తనకు ప్రాణ హాని ఉందంటూ కార్పొరేటర్ ఫిర్యాదు
వైసిపి నేత పొట్టి మూర్తి కార్పొరేటర్ పి.వి. సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పీవీ సురేష్ తనపై దాడికి దిగాడని అతనితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు
Visakhapatnam: విశాఖపట్నంలో వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. దీంతో విశాఖ ఎం.పి. MVV సత్యనారాయణ (MP. Satyanarayana) సమక్షంలో వైసీపీ నేతలు(YCP Leaders) బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇటీవల హిందుస్థాన్ షిప్యార్డులో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడు అప్పల రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు 58వ వార్డ్ లోని కార్మికుడి నివాసానికి ఎంపీ వెళ్లే సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. MP తో పాటు స్థానిక కార్పొరేటర్ లావణ్య, 61 వ వార్డు కార్పొరేటర్ పీ.వీ.సురేష్ , వైసిపి నేతలు పొట్టి మూర్తి, మిగిలిన నాయకులు వెళ్లారు. ఎంపీ తో పాటు వెళ్తున్న క్రమంలోనే ఎంపీ పక్కనే ఉన్న పొట్టి మూర్తిని కార్పొరేట్ సురేష్ పక్కకు జరిగమ౦టూ బలంగా నెట్టారు. వెంటనే పొట్టి మూర్తి సైతం పీవీ సురేష్ ను వెనక నుండి నెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
స్థానిక కార్పొరేటర్ లావణ్య వర్గం సైతం కలుగజేసుకొని మా వార్డులో మీ పెత్తనమేంట౦టూ కార్పొరేట్ పీవీ సురేష్, వైసిపి నేత పొట్టి మూర్తి లతో వాదనకు దిగారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలుగజేసుకొని బాహాబాహీకి దిగిన ఇరువర్గాలను సముదాయించారు. అయితే ఈ వివాదంపై వైసిపి నేత పొట్టి మూర్తి కార్పొరేటర్ పి.వి. సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పీవీ సురేష్ తనపై దాడికి దిగాడని అతనితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పి.వి.సురేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Reporter: S.Srinivas, Tv9 Telugu