Andhra Pradesh: తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలో తనయుడు మృతి.. కుటుంబంలో విషాదం

|

Nov 10, 2022 | 9:06 AM

సూర్య గ్రహణం రోజు పని నుంచి ఇంటికి వెళ్తుండగా జగదీష్ కు వాహనం ఢీ కొనటంతో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. కుమారుడి ప్రమాదం జరిగినప్పటి నుంచి తండ్రి మహాదేవప్ప తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

Andhra Pradesh: తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలో తనయుడు మృతి.. కుటుంబంలో విషాదం
son and father died in kurnool
Follow us on

తండ్రి మరణించినా అంత్యక్రియలకు రాలేని పరిస్థితిలో కుమారుడు ఆస్పత్రిలో ఉన్నాడు. తనయుడి మీద బెంగతో తండ్రి మరణించాడు. తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలో కుమాడురు మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో SMT కాలనిలో నివాసముంటున్న మహాదేవప్ప (65) భార్య బేబిలకు జగదీష్ (32) ఒక్కడే సంతానం. తండ్రి రాళ్ల కొట్టే పనిచేస్తూ కుటుంబాని పోషిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జగదీష్, భార్య రాధలు కలసి హైదరాబాద్ కు వెళ్లి అక్కడే పనిచేసుకుంటు జీవనం సాగిస్తు తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. గత నెలలో ఏర్పడిన సూర్య గ్రహణం రోజు పని నుంచి ఇంటికి వెళ్తుండగా జగదీష్ కు వాహనం ఢీ కొనటంతో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. కుమారుడి ప్రమాదం జరిగినప్పటి నుంచి తండ్రి మహాదేవప్ప తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి జగదీష్ తమ ఇద్దరు కుమార్తెలను ఎమ్మిగనూరుకు పంపి తల్లిదండ్రుల దగ్గరే ఉంచాడు.

బుధవారం హైదరాబాద్ లో జగదీషు ఆపరేషన్ చేస్తుండటంతో తన భార్యను మహాదేవప్ప కుమారుడి దగ్గరకు పంపి ఇద్దరు చిన్న బాలికలను తన దగ్గర పెట్టుకున్నాడు. మహాదేవప్ప బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. మృతి చెందిన విషయం హైదరాబాద్ లో ఉన్న భార్యకు సమాచారం అందించడంతో మధ్యాహ్నానాకి ఆమె ఎమ్మిగనూరుకు చేరుకుంది. తండ్రి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే హైదరాబాద్ లో ఆపరేషన్ చేస్తుండగా జగదీష్ కు బీపీ, షుగర్ పెరిగి కుమారుడు మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన విషయాన్ని కోడలు రాధ అత్తగారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఒకే సమయంలో కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రాధ తన భర్త మృతదేహాన్ని
అంబులెన్స్ లో  ద్వారా స్వగ్రామం అయిన ఎమ్మిగనూరు తరలించింది. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందటంతో ఆ కాలనిలో విషాధచాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

Reporter: Nagi Reddy, TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..