Andhra Pradesh: వివాహేతర సంబంధం.. మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పెట్టి.. అతి కిరాతకంగా..
మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పేల్చి మర్డర్..! కడప జిల్లాలో ఉన్మాది కక్షకి వీఆర్‌ఏ బలైపోయాడు.. వీఆర్‌ఏ భార్యతో నిందితుడికి గతంలో వివాహేతర సంబంధం..? ఉండేది.. ఈ క్రమంలో వీఆర్ఏ నరసింహ మందలించినందుకు బాబు అనే వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి వీఆర్ఏ నిద్రిస్తున్న మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేశాడు.. పేలుడులో వీఆర్ఏ మరణించగా.. వీఆర్‌ఏ భార్యకీ తీవ్రగాయాలయ్యాయి..
మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పెట్టి సినిమా లెవెల్‌లో వీఆర్‌ఏను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో వీఆర్‌ఏ స్పాట్‌లో మరణించగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి బాబు అనే వ్యక్తితో విభేదాలు ఉన్నాయి. వివాహహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. వైఎస్ఆర్ కడప వేముల మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తున్నారు.. అయితే ఆయన మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చడంతో ఆయన అక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో వీఆర్‌ఏ నరసింహ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు వివాహేతర సంబంధం విషయంలో పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.. బాబు అనే వ్యక్తి ఈ పేలుడుకు కారణమని అనుమానిస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కాగా.. ఈ ఘటనలో వీఆర్ఏ ఇల్లు ధ్వంసమైంది.. అయితే బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తోంది మృతుడి కూతురు పుష్పావతి.
తన తల్లీ.. బాబుతో మాట్లాడలేదన్న కోపంతోనే తన నాన్నను చంపాడని చెబుతోంది. బాబు కుటుంబానికి.. తమ కుటుంబానికి మధ్య గతంలో గొడవలు జరిగాయని.. రాత్రి తన తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కరెంటు తీసి.. జిలెటిన్ స్టిక్స్ పెట్టి.. బాబు చంపాడని కూతురు పుష్పావతి ఆరోపించింది.
అయితే.. గత రెండు నెలల క్రితం కూడా బాబు వీఆర్‌ఏ నరసింహతో గొడవ పడ్డాడని.. అప్పటినుంచి కక్ష పెంచుకుని.. చంపాడని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..