Viral News: వార్నీ ఈ స్టూడెంట్ మాములోడు కాదుగా.. పరీక్షలో ఫెయిల్ అవుతానని కొత్తగా ఏం చేశాడంటే?
సాదారణంగా తనను ఎలాగైనా పాస్ చేయాలని పరీక్ష పేపర్‌లో ఉపాధ్యాయులకు విజ్ఞప్తు చేస్తూ లేఖలు రాసే విద్యార్థులను చూసి ఉంటారు, లేదా సమాధానాలకు బదులుగా ఆన్‌సర్ షీట్‌లోనే తనను పాస్ చేయాలని కోరే విద్యార్థులను చూసి ఉంటారు. కానీ ఇక్కడో విద్యార్థి మాత్రం తానను ఎగ్జామ్ పాస్ చేయాలని ఏకంగా ఇంటర్ బోర్డు సభ్యులకే ఫోన్ చేశారు. ఈ ఆశ్చర్యకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

తనను ఎలాగైన సాప్ చేయాలని ఓ విద్యార్థి నేరుగా ఇంటర్ బోర్డుకే ఫోన్ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన ఓ విద్యార్థి స్థానికంగా ఉన్న ఓ ఇంటర్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇటీవలే అతను ఇంటర్ పరీక్షలు కూడా రాశాడు. అయితే బుధవారం ఏపీ ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయపడిన సదురు విద్యార్థి భయంతో ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు. తాను ఏమి చదవలేదని, ప్రశ్నాపత్రాన్నే మూడుసార్లు రాశానని ఏదో విదంగా తనను పాస్ చేయాలని కోరాడు. అంతే కాదు జవాబుపత్రాల్లో డబ్బులు కూడా పెట్టానని చెప్పుకొచ్చాడు.
బాలుడి మాటు విన్న అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తర్వాత తేరుకొని విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫెయిల్ అయినా పర్వాలేదని.. త్వరలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయని.. ఇప్పుడ శ్రద్దగా చదివితే పాసయ్యే అవకాశం ఉంటుందని, అందుకే మంచిగా చదువుకోవాలని ఫోన్‌లోనే సూచించారు. అనంతరం విశాఖ ఆర్‌ఐఓకు సమాచారం ఇచ్చి, విద్యార్థి పేరెంట్స్ విషయం చెప్పాలని సూచించారు.
దీంతో హాల్ టికెన్ నెంబర్ ఆధారం విద్యార్థి వివరాలు కనిపెట్టిన అనంతరం జిల్లా అధికారులు సదురు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎగ్జామ్‌లో ఫాస్ చేయాలని తమ కుమారుడు ఇంటర్ బోర్డుకు ఫోన్ చేశాడని తెలిపారు. అయితే సదురు విద్యార్థి ఫస్ట్ ఇయర్‌లో రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కాగా ప్రస్తుతం సెకండ్ ఇయర్‌లోనూ 3 సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినట్టు అధికారులు తెలిపారు. కాబట్టి విద్యార్థిని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
