Andhra Pradesh: వాలంటీర్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్.. మదురైలో అదుపులోకి..

ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతోనే తన కొడుకును అరెస్ట్‌ చేశారని విశ్వరూప్ విమర్శించారు. అయితే కేసు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

Andhra Pradesh: వాలంటీర్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్.. మదురైలో అదుపులోకి..
Volunteer Murder Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 21, 2024 | 8:57 PM

మాజీమంత్రి, వైసీపీ నేత పినిపె విశ్వరూప్‌కు షాక్ తగిలింది. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు. అతడిని ఈ నెల 18న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతోపాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మదురైలో విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు తనను అరెస్ట్ అక్రమమని ఆరోపించారు శ్రీకాంత్. పథకం ప్రకారమే కేసులో ఇరికించారని ఆరోపించారు. వాలంటీర్‌ దుర్గాప్రసాద్ హత్య కేసుతో సంబంధం లేదన్నారు. తన కుమారుడి అరెస్ట్‌ను తప్పుబట్టిన మాజీ మంత్రి విశ్వరూప్… రాజకీయ కక్షతోనే తన కొడుకును అరెస్ట్‌ చేశారన్నారు. దుర్గాప్రసాద్‌ హత్యతో తన కొడుకుకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. ధర్మేష్‌ను భయపెట్టి తన కుమారుడి పేరు చెప్పించారని ఆరోపించారు. తన కొడుకు శ్రీకాంత్ అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

వీడియో చూడండి..

హత్యకు గురైన వలంటీర్‌కు విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌తో సంబంధం ఉందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ ఓడిపోయిన తర్వాత బాధితుల్లో ధైర్యం వచ్చి తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని బాధితురాలు కోరారని తెలిపారు. కేసు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి సుభాష్ అన్నారు.

కూటమి ప్రభుత్వం తమ నేతలను వేధిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న క్రమంలోనే.. మాజీమంత్రి కుమారుడు అరెస్ట్ జరగడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!