Kodali Nani: ‘జయంతికి, వర్థంతికి తేడా తెలియదు’.. చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

| Edited By: Ravi Kiran

Oct 21, 2022 | 2:05 PM

ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధాలే కొనసాగుతుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఒకరిపై విమర్శలతో రోజు గడిచిపోతుంటుంది. ఇక తాజాగా మాజీ..

Kodali Nani: జయంతికి, వర్థంతికి తేడా తెలియదు.. చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Kodali Nani
Follow us on

ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధాలే కొనసాగుతుంటాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఒకరిపై విమర్శలతో రోజు గడిచిపోతుంటుంది. ఇక తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనికిమాలిన వాళ్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు జయంతికి, వర్థంతికి తేడా తెలియదని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలవని లోకేష్‌.. జగన్‌ గురించి మాట్లాడుతారా..? అంటూ ఆక్రోశం వెల్లగక్కారు. చంద్రబాబు పక్క పార్టీపై ఆధారపడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ పులి కాబట్టే మంగళగిరిలో నువ్వు ఆహారం అయ్యావు.. పచ్చి అబద్దాలు మాట్లాడటం లోకేష్‌కు అలవాటేనని ఆరోపించారు.

ఇసుక మీద సంవత్సరానికి రూ.750 కోట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వానికి సమకూరుస్తున్నారని, అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ బీసీలకు పెద్ద పీఠ వేశారని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. మూడు రాజధానుల మీద చర్చ జరగవద్దనే డైవర్డ్‌ రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేయించిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఊరుకునేది లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి