Andhra Pradesh: అమ్మతనానికే అవమానం.. కూతుళ్లను రెండో భర్త వద్దకు పంపించిన మహిళ..

|

Jul 14, 2023 | 8:31 PM

Eluru, July 14: అమ్మ అనే పదానికి అర్థం మార్చేసింది ఆమె. తన కంటి పాపలను కనురెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే వాళ్లను కాటేసింది. రెండో మొగుడి మోజులో కన్నకూతుళ్లతో చెప్పలేనంత ఘోరంగా వ్యవహరించింది. రెండో భర్త కోరికలకు తన ఇద్దరు కూతుళ్లనూ బలి చేసింది. తానే స్వయంగా ఆ మైనర్‌ బాలికలను ఆ మానవ మృగానికి అప్పచెప్పింది.

Andhra Pradesh: అమ్మతనానికే అవమానం.. కూతుళ్లను రెండో భర్త వద్దకు పంపించిన మహిళ..
Harassment
Follow us on

Eluru, July 14: అమ్మ అనే పదానికి అర్థం మార్చేసింది ఆమె. తన కంటి పాపలను కనురెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే వాళ్లను కాటేసింది. రెండో మొగుడి మోజులో కన్నకూతుళ్లతో చెప్పలేనంత ఘోరంగా వ్యవహరించింది. రెండో భర్త కోరికలకు తన ఇద్దరు కూతుళ్లనూ బలి చేసింది. తానే స్వయంగా ఆ మైనర్‌ బాలికలను ఆ మానవ మృగానికి అప్పచెప్పింది. అతగాడు కామదాహంతో వాళ్లను కాటేస్తుంటే.. కాపాడాల్సిన కన్నతల్లే, అడ్డుకోవాల్సిన అమ్మే స్వయంగా ఆ కామపిశాచిని ప్రోత్సహించింది. మేనమామ సాయంతో మైనర్‌ బాలికలు ఆ నరకకూపం నుంచి బయటపడ్డారు. రాక్షసత్వం కూడా భయపడే అమ్మానుషం ఇది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏలూరు పరిధిలోని వట్లూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో చనిపోయాడు. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా.. పుట్టా సతీష్‌ కుమార్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అయితే, అప్పటికే ఆమె సంతానం కలుగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఇక ఆమెకు పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో మరో మహిళ ద్వారా పిల్లలను కంటానని సతీష్ చెప్పాడు. దాంతో సతీష్ ఎక్కడ దూరం అవుతాడేమో అని ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు కుమార్తెలు వయసుకొచ్చారని, వారి ద్వారా పిల్లలను కనొచ్చంటూ భయంకరమైన సలహా ఇచ్చింది. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న ఆమె పెద్ద కుమార్తెను సతీష్‌ వద్దకు పంపింది. అమ్మాయి ఈ దారుణానికి నిరాకరించగా.. చిత్రహింసలకు గురి చేసి అతనితో గడిపేలా చేసింది. చివరకు బాలిక గర్భం దాల్చింది. అయితే, చదువు ఆగి అందరికీ తెలిసిందని భయపడిన మహిళ, సతీష్.. అబార్షన్ చేయించారు. రెండేళ్ల తరువాత బాలిక పదో తరగతిలోకి వచ్చింది. దాంతో మరోసారి విద్యార్థినిని గర్భవతిని చేశాడు సతీష్. 2021 జూన్ 3న పాప పుట్టగా.. తనకు మగ బిడ్డే కావాలంటూ పట్టుబట్టాడు సతీష్. దాంతో చేసేది లేక ఈసారి రెండో బిడ్డను సతీష్ వద్దకు పంపింది మహిళ. ఆమె కూడా గర్భం దాల్చగా.. ఇటీవల ఇంట్లోనే డెలివరీ చేశారు. మగ శిశువు ప్రాణం లేకుండా పుట్టడంతో నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.

అయితే, ఇటీవల సతీష్‌కు, మహిళకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది. సతీష్‌పై పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు కూడా పెట్టింది. ఇక అమ్మాయిలు ప్రెగ్నెన్సీ విషయం మేనమామకు తెలియడంతో కథ మొత్తం రివీల్ అయ్యింది. బాధిత బాలికలను ఇద్దరినీ వెంట తీసుకుని, ఏలూరు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ, సతీష్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..