ఏలూరులో వింత రోగానికి కారణాలు ఇవే.. బ్లడ్ శాంపిల్స్ ద్వారా బయటపడ్డ విషయాలు.. లెడ్, నికెల్ అధికంగా ఉండడమే సమస్య

ఏలూరులో వింత రోగానికి గల కొన్ని కారణాలు తెలిశాయి. దీనిపై ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పరిశీలన చేపట్టిన తర్వాత పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏలూరులో వింత రోగానికి కారణాలు ఇవే.. బ్లడ్ శాంపిల్స్ ద్వారా బయటపడ్డ విషయాలు.. లెడ్, నికెల్ అధికంగా ఉండడమే సమస్య
Follow us
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 2:46 PM

Eluru hit by mystery illness: ఏలూరులో వింత రోగానికి గల కొన్ని కారణాలు తెలిశాయి. దీనిపై ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పరిశీలన చేపట్టిన తర్వాత పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ద్వారా కొన్ని విషయాలు తెలిశాయి. బాధితుల రక్తంలో సీసం( లెడ్), నికెల్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ వింతవ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తలనొప్పి, మూర్ఛ, వెన్నునొప్పి, నీరసం, మతి మరుపు, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ ఎయిమ్స్‌ నివేదికిచ్చింది. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పింది. సీసం అనేది సాధారణంగా బ్యాటరీల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలో వెళ్లి ఉండవచ్చని అంచనా. సీసమ్, నికెల్ వంటి లోహాలు శరీరంలో ఎలా వెళ్లాయనే అంశం పై లోతుగా పరిశోధన సాగుతోంది.

అసలు లెడ్, నికెల్ మనిషిలో ఏ స్థాయిలో ఉండాలి.. అవి తక్కువ ఉంటే ఏమవుతుంది.. ఎక్కువైతే ఏమవుతుందనే విషయాలపై ఓసారి చూద్దాం. లెడ్ వల్ల శరీరానికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. రక్తంలో లెడ్ లోపించినా,పెరిగినా చాలా ప్రమాదం. మనుషుల రక్తంలో 10 మైక్రోగ్రామ్స్ కు మించి లెడ్ ఉండకూడదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఏలూరు బాధితుల్లో లెడ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరంతా పైకి ఆరోగ్యంగా ఉన్నా రక్తంలో లెడ్ శాతం పెరగడం వల్ల సమస్యల బారిన పడుతున్నారు. లెడ్ శాతం పెరిగితే నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మెదడుపై ఇది ప్రభావం చూపుతోంది. వినికిడి కోల్పోవాల్సి వస్తుంది. కాళ్లు,చేతులు నిస్సత్తువుగా మారుతాయి. లెడ్ శాతం పెరగటానికి కొన్ని కారణాలున్నాయి. తాగునీరు, బోరు వాటర్, రోడ్డుపక్కన అమ్ముతున్న తినుపదార్థాలలో ఉపయోగించే రంగులు ఇందుకు కారణం కావొచ్చు.

ఇళ్లలో పేరుకు పోయిన ధుమ్ము,ధూళి కూడా కారణం. పెయింట్స్, కుంకుమ, సింధూరం, కాస్మోటిక్ కలర్స్, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, ప్లాంట్ ఫుడ్స్, సంప్రదాయ కారక మందులు ప్రొటీన్ కలిగిన వస్తువులను మితంగా, అతిగా తీసుకున్నా ఈ సమస్య బారినపడతారు. అలాగే కాల్షియం, ఐరన్, జింక్ తక్కువగా ఉన్నా ఈ లెడ్ శాతం అధికంగా పెరగడం జరుగుతుంది. తక్కువ ధరకు దొరికే ప్లాస్టిక్ మగ్స్, లెడ్ పెన్సిల్స్, లెడ్ ఫ్రీ లేని రంగులు, బొమ్మలు వాడటం వల్ల కూడా దీని బారిన పడే అవకాశం ఉంది. దేశంలోని ఏడు మేజర్ సిటీస్ లో ఈ లెడ్ శాతంతో బాధపడుతున్నవారి సంఖ్య 100 మిలియన్స్ వరకు ఉండొచ్చని అంచనా. 12 సంవత్సరాల లోపు పిల్లలు 50 శాతం వరకు లెడ్ సంబంధిత రోగాల బారినపడుతుంటారు. ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా చిన్న పిల్లలు, గర్భిణీలపై ఉంటుంది. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు ఎక్కువవుతాయి. నీటిలో సీసం, ఆర్గానో క్లోరిన్ కలిసినప్పుడు కూడా దీని బారినపడతారు.

రక్తంలో నికెల్ సరైన మోతాదులో ఉంటే ఏం కాదు. కానీ అది ఎక్కువ అయితే ప్రమాదం. మనం తీసుకునే వేరుశనగ, డ్రైబీన్స్, సోయాబీన్, గ్రేయిన్స్, చాకోలేట్లో లో నికెల్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా కొద్ది పరిమాణంలోనే అవసరం ఉంటుంది. ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండటం కోసం నికెల్ ఉపయోగపడుతుంది. అయితే మనుషుల్లో నికెల్ లోపించిన ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక జంతువులలో అయితే నికెల్ శాతం తగ్గిన ఘటనలు ఎక్కువగానే మనకు కనిపిస్తుంటాయి. నికెల్ ఎలర్జీ అనేది చాలా సాధారణ అంశమేనని డాక్టర్లు అంటున్నారు. నిఖేల్ లోపం వల్ల దురద, దద్దర్లు వస్తుంటాయి. అయితే చెవిపోగులు, వివిధ ఆభరణాలు వాడటం నాణేలు, సెల్ ఫోన్లు, కంటిఅద్దాల ఫ్రేమ్స్ వల్ల నికెల్ అలెర్జీలు వస్తుంటాయి.