హైదరాబాద్ వ్యాక్సిన్‌పైనే ప్రపంచ దేశాల ఫోకస్.. చేరుకున్న 64 దేశాల రాయభారులు.. అందరి దృష్టి కోవాక్జిన్‌పైనే!
హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకుంది. వీరంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వచ్చారు. వీరు శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి చేరుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శిస్తారు.
హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకుంది. వీరంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వచ్చారు. వీరు శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి చేరుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శిస్తారు. కోవిడ్ టీకాల డెవలప్‌మెంట్ పై చర్చిస్తారు. టీకాల తయారీకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ బృందాలు చూడనున్నాయి. కోవిడ్ టీకాల పురోగతిని తెలుసుకోనున్నాయి. తర్వాత శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ అవుతారు. సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్, హైకమిషనర్‌లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశలో ఉంది. ఇక బయోలాజికల్– ఈ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్–1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఢిల్లీలో నేడు కీలక సమావేశం నిర్వహించింది. సీరమ్, భారత్ బయోటెక్ , ఫైజర్ కంపెనీలు ఇండియాలో అత్యవసరంగా వ్యాక్సిన్ ఉపయోగించడానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఈ కీలక సమావేశం కొనసాగుతోంది.