దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 9 మంది ఈ కేసులో అరెస్ట్ కాగా.. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలో అతనిని అరెస్ట్ చేసిన ఈడీ మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చనుంది. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సౌత్ గ్రూప్.. మాగుంట రాఘవరెడ్డి పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. కాగా ఇదే కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఆ సమయంలో ఆయనతోపాటూ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి ఆయన్ని అరెస్టు చేసింది. లిక్కర్ కార్టెల్ ద్వారా మధ్యవర్తుల ద్వారా ఆప్ ఫ్రభుత్వానికి లంచాలు ఇచ్చారని మాగుంట రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. గత రెండ్రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో.. ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిసింది. సౌత్ గ్రూప్‌లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటివరకూ అరెస్ట్ అయ్యారు
కాగా ఈ స్కామ్ కేసులో రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ కేంద్రం పని చేసే చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు రోజు హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. ఈయన గతంలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తుల వద్ద సీఏగా పని చేశారు. రామచంద్ర పిళ్లైకి కూడా చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేశారు. ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను కూడా ఈడీ అధికారులు ఫిబ్రవరి 8 అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతణ్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా మాగుంట రాఘవ విషయానికొస్తే.. బాలాజీ డిస్టిలరీస్ కాకుండా, ఏంజెల్ షాంపైన్ ఎల్ఎల్పీ, తమిళనాడు డిస్టిలరీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఇతర కంపెనీలు మాగుంట కుటుంబానికి సంబంధించిన రెండు కీలక సంస్థలు సీబీఐ రాడార్లోకి వచ్చాయి. వీటి తయారీ, పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల ద్వారా మద్యం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 నియమాలు ఏ కంపెనీకి రెండు జోన్ల కంటే ఎక్కువ కేటాయించకూడదని స్పష్టంగా చెప్పినప్పటికీ, పిక్సీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మాగుంట ఆగ్రో ఫాష్ ప్రైవేట్ లిమిటెడ్లకు జోన్ 32 , జోన్లకు జోనల్ రిటైల్ లైసెన్సులు లభించాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..