AP News: వీళ్లు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అంతే.. ఈసీ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా,స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు సమన్వయం, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై త్వరగా స్పందించాలని సూచించారు.

AP News: వీళ్లు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అంతే.. ఈసీ కీలక ఆదేశాలు..
Cec Mukesh Kumar Meena
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 07, 2024 | 6:00 AM

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా,స్వేచ్ఛగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. జిల్లా స్థాయిలో అధికారులు సమన్వయం, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై త్వరగా స్పందించాలని సూచించారు. సమగ్ర అవగాహనతో తక్షణమే సమస్యలపై స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో సీఈవో మీనా మీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను, అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల కోడ్‎ను పటిష్టంగా అమలుపర్చే అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎటు వంటి హింసకు, రీపోలింగ్ కు అవకాశం లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు ఇతర ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని సూచించారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్‎లలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మీనా అధికారులను ఆదేశించారు. గోవా, హర్యానా నుండి అక్రమంగా లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ. 50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తుచేయాలని.. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగువేయాలని వారిని ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకై రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా త్వరలో ఎస్.ఓ.పి.ని రూపొందిస్తామని మీనా చెప్పారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తక్షణ చర్యలు..

జిల్లాల అధికారులకు మరిన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా పొందాల్సిన అనుమతి విషయంలో సీఈసీకి లేఖ రాశామన్నారు.ఈ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తగిన వివరణ అందేలోపు ఇంటింటి ప్రచారానికి సంబంధించి ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్వోకు, పోలీస్ స్టేషన్‎కు ఇస్తే చాలు అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకు ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో వారు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. 10 లక్షలకు పైబడి జప్తుచేయబడిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమచారాన్ని ఎప్పటి కప్పుడు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులతో తరచుగా సమావేశమై గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై నిఘాను పటిష్టపరచాలని.. లా అండ్ ఆర్డర్ ఏడిజి అధికారి సూచించారు. లిక్కర్, డ్రగ్స్ రవాణా చేసే కింగ్ పిన్లపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్‎ల్లో కూడా నిఘాను మరింత పటిష్టపర్చాలని ఆదేశించారు. సోషల్ మీడియా కంప్లైంట్స్‎పై తగు చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ ఎస్.ఓ.పి.ని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కమ్యునికేట్ చేయడం జరిగిందని తెలిపారు. మీడియాకు అథారిటీ లెటర్స్ జారీకై సమగ్ర సమాచారాన్ని కూడా అందజేయడం జరిగిందని, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Latest Articles
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..