TTD: తిరుమల హుండీలకు రికార్డు స్థాయిలో ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే తొలిసారి.. కొండపై భక్తుల బారులు..

కలియుగ దైవం, తిరుమల శ్రీవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు...

TTD: తిరుమల హుండీలకు రికార్డు స్థాయిలో ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే తొలిసారి.. కొండపై భక్తుల బారులు..
Tirumala
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 03, 2023 | 9:14 AM

కలియుగ దైవం, తిరుమల శ్రీవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా రూ.7.68 కోట్లు వచ్చింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. సోమవారం స్వామివారిని 69,414 మంది దర్శించుకోగా.. 18,612మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే.. గతేడాది అక్టోబర్‌ 23న అత్యధికంగా రూ.6.31 కోట్లు వచ్చింది. అంతే కాకుండా 2022 లో తిరుమల హుండీలు గలగలలాడాయి. శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను విక్రయించారు.

కాగా.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 11 వరకు కొనసాగనుంది. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.సామాన్య భక్తులు ఎక్కువ మందికి వైకుంఠ ద్వార సర్వదర్శనం చేయించాలని ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సిఫారసు లేఖల దర్శనాలు రద్దు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి తిరుమల క్యూ లైన్ లోకి రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి