Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇంకా ఆ ఇబ్బందులు ఉండవు..

తిరుమల జలాశయాలకు జలకళతో తొణికిసలాడుతున్నాయి. తిరుమలలోని ఐదు జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే గోగర్భం, పాప వినాశనం డ్యామ్‌ల గేట్లను ఎత్తివేయగా ఆకాశగంగా, కుమారధార, పసుపు ధార డ్యాంలు ఓవర్ ఫ్లో అవుతున్నాయి. దీంతో నీటి కొరత తీరగా ఏడాది కాలం తిరుమల నీటి అవసరాలు తీరాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇంకా ఆ ఇబ్బందులు ఉండవు..
Tirumala
Follow us
Raju M P R

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 15, 2024 | 6:48 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం తిరుమల నీటి అవసరాలను తీర్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తిరుమలగిరుల్లోని డ్యాంలకు జలకళ వచ్చింది. తిరుమలలోని జలాశయాలు నిండు కుండలా మారేలా చేసింది. భారీ వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టంతో పరవళ్ళు తొక్కుతుండటంతో కొత్త అందాలు భక్తులన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ఓవర్ ఫ్లో అవుతున్నట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 355 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయంటున్నారు.

పాపవినాశనం డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 697.14 మీటర్లు కాగా ప్రస్తుతం 697.00 మీటర్లు ఉంది. డ్యాంలో నీటి నిల్వ సామ‌ర్థ్యం 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 5192.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. ఇక గోగర్భం డ్యామ్ ఎఫ్‌ఆర్‌ఎల్ 2894.00 అడుగులు కాగా అంతే స్థాయిలో 2894.00 అడుగుల మేర వరద నీరు చేరింది. ఇక నిల్వ సామ‌ర్థ్యం 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు కాగా ప్ర‌స్తుత నిల్వ కూడా అంతే మొత్తంలో 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. ఇక ఆకాశ గంగా డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 865.00 మీటర్లు కాగా ప్రస్తుతం 865.00 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. డ్యాంలో ఫుల్ స్టోరేజ్ 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు కాగా ప్ర‌స్తుత నిల్వ కూడా 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు ఉంది. కుమారధార డ్యామ్ ఎఫ్‌ఆర్‌ఎల్ 898.24 మీటర్లు కాగా ప్రస్తుతం 898.15 మీటర్ల మేర వరద నీటి కళ వచ్చింది. నీటి నిల్వ సామ‌ర్థ్యం 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు కాగా ప్ర‌స్తుత నిల్వ 4229.42 ల‌క్ష‌ల‌ గ్యాలన్లుగా టీటీడీ చెబుతోంది.

పసుపుధార డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 898.24మీటర్లు కాగా ప్రస్తుతం 898.15 మీటర్లకు చేరుకుంది. నిల్వ సామ‌ర్థ్యం 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు కాగా ప్ర‌స్తుత నీటి నిల్వ 1267.48 ల‌క్ష‌ల గ్యాలన్లుగా టీటీడీ చెబుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఆగకుండా కురిసిన వర్షాలు తిరుమల జలాశయాలను నిలిపివేయడంతో 355 రోజులు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. మొత్తం 5 డ్యామ్‌ల్లో 14206.90 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులోకి వచ్చింది. ఇక తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉందని చెబుతున్న టీటీడీ దాదాపు ఏడాదికి సరిపడా నీటి నిల్వలున్న జలాశయాలు తిరుమల నీటి అవసరాలను తీర్చినట్లు చెప్తోంది. నిండుకుండలా మారిన జలాశయాలకు ప్రత్యేక పూజలను కూడా టీటీడీ నిర్వహించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి