Visakha: విశాఖలో మత్తు ఇంజక్షన్ల కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకున్న అధికారులు

|

Jan 26, 2023 | 10:50 AM

జ్ఞానాపురం బస్‌స్టాప్ సర్వీస్ రోడ్డు దగ్గర ఇంజక్షన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు ఎస్ఈబీ అధికారులు. ఇంజక్షన్లు అమ్ముతున్న నిందితులు శ్రీకాంత్, వెంకటరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎస్ఈబీ అధికారులు.

Visakha: విశాఖలో మత్తు ఇంజక్షన్ల కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకున్న అధికారులు
Drugs Injections
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా ఎక్కడోచోట డ్రగ్స్ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖలో వివిధ రకాలైన మత్తు పదార్ధాలు లభిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి.  విశాఖలో మూడో రోజు వరుసగా మత్తు ఇంజక్షన్ల కలకలం రేపాయి. జ్ఞానాపురం బస్‌స్టాప్ సర్వీస్ రోడ్డు దగ్గర ఇంజక్షన్లు అమ్ముతున్నట్లు గుర్తించారు ఎస్ఈబీ అధికారులు. ఇంజక్షన్లు అమ్ముతున్న నిందితులు శ్రీకాంత్, వెంకటరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎస్ఈబీ అధికారులు.

నిందితుల నుంచి 76 పెంటా జోసైన్ లాక్టేట్ ఇంజక్షన్లు సీజ్ చేశారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఎస్ఈబీ నిర్ధారణకు వచ్చారు. కీలక నిందితుడు అనుపం అధికారి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు నగరంలోని పెదజలారి పేట, అగ్రహారం వీధిలో టాస్క్ ఫోర్స్ సోదాలు చేశారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 490 పెంట జోసైన్ లాక్టేట్ ఇంజక్షన్లు సీజ్ చేశారు. కీలక నిందితుడు పూర్ణ మార్కెట్ మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..