AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవేం గలీజు పనుల్రా..! కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. అసలు మ్యాటర్ తెలిస్తే!

అవాంఛిత గర్భం వదిలించుకోవాలా.. శృంగార సామర్ధ్యం పెరగాలా.. అవిగో మందులు, ఇవిగో మందులంటూ ఆన్ లైన్‌లో భారీగా ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాస్తవానికి వైద్యుని సలహా మేరకు మాత్రమే ఇలాంటి మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయటం, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మటం రెండూ నేరమే. కాని ఇంట్లోనే అనధికార మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేసి రూల్స్‌కి విరుద్ధంగా కొందరు వ్యాపారం నిర్వహిస్తున్నారు.

ఇవేం గలీజు పనుల్రా..! కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. అసలు మ్యాటర్ తెలిస్తే!
Drug Control Officers Raids
B Ravi Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 11, 2025 | 8:57 AM

Share

అవాంఛిత గర్భం వదిలించుకోవాలా.. శృంగార సామర్ధ్యం పెరగాలా.. అవిగో మందులు, ఇవిగో మందులంటూ ఆన్ లైన్‌లో భారీగా ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాస్తవానికి వైద్యుని సలహా మేరకు మాత్రమే ఇలాంటి మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయటం, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మటం రెండూ నేరమే. కాని ఇంట్లోనే అనధికార మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేసి రూల్స్‌కి విరుద్ధంగా కొందరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో పోలీసులు సాటుమాటు దందాకు చెక్ పెట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిబంధనలకు విరుద్ధంగా వయాగ్రా, గర్భనిరోధక మందులు విక్రయిస్తున్న ప్రాంతంపై తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ టి. మల్లిఖార్జున రావు దాడి చేశారు. అసలేం జరిగిందంటే, గుండాల చంద్రశేఖర్ అనే వ్యక్తి పాలకొల్లులోని కటికిరెడ్డివారి వీధిలో ఉంటున్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్, లైంగిక సామర్థ్యం కోసం వినియోగించే sildenafil citrate, tadlafil citeate వంటి మందులు, unwanted -72, alplagdam 0.5 వంటి టాబ్లెట్లు విక్రయిస్తున్నాడు. మొత్తం 11 రకాల మందులు అతని వద్ధ దొరకగా వాటి అసలు విలువ అంటే ఎంఆర్‌పీ ప్రకారం 16 వేల రూపాయలు ఉంటుంది. అయితే ఇక బ్లాక్ మార్కెట్ లో రెట్టింపు ధరకు వీటి విక్రయాలు జరుగుతున్నాయి. రాజమండ్రి కి చెందిన ఒక మెడికల్ షాపు నుంచి పెద్ద మొత్తం లో వీటిని కొనుగోలు చేసి నిందితుడు గోప్యంగా విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీలో తేలింది. దీంతో సమాచారం అందుకున్న డ్రగ్స్ అధికారులు దాడి చేసి చీకటి దందాకు చెక్ పెట్టారు. సరుకును సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికే ఈగల్ టీం ద్వారా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మందులు దుకాణాలపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి సుమారు 150 కి పైగా కేసులు సైతం నమోదయ్యాయి. అయితే ఇపుడు అధికారులు దృష్టి ఇల్లీగల్ మందులు వ్యాపారులపై పడింది. వరుస తనిఖీలతో నిందితులపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..