Gold Seized: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!

|

Nov 04, 2021 | 10:17 PM

Gold Smuggling - Visakhapatnam: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.98 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.

Gold Seized: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టివేత.. దాని విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Gold Smuggling
Follow us on

Gold Smuggling – Visakhapatnam: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.98 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతా నుంచి విశాఖపట్నం వచ్చిన హౌరా, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికులు 3.98 కేజీల బంగారాన్ని ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా రవాణా చేస్తున్నాడు. దీనిపై ముందే సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు.. తనిఖీలు చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ సుమారు రూ. 1.91 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా, బంగ్లాదేశ్ కేంద్రంగా బంగారాన్ని తీసుకువచ్చి కోల్‌కతాలో ఆభరణాల రూపంలోకి మార్చి.. అక్రమ రవాణా చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం.. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్మగ్లింగ్ వ్యవహారంపై మరింత సమాచారం కోసం నిందితుడిని విచారిస్తున్నారు.

Also read:

Adivi Sesh’s Major : అప్‌డేట్స్‌తో అంచనాలు పెంచేసిన యంగ్ హీరో.. ‘మేజర్’గా మెప్పిస్తానంటున్న అడివి శేష్..

Hylo Open: 32 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించిన కిదాంబి శ్రీకాంత్.. రెండో రౌండ్‌లోకి ప్రవేశం..!

Sarkaru Vaari Paata: మహేష్ ‘సర్కారు వారి పాట’ మూవీకి ఆ సెంటిమెంట్.. అందుకే సినిమా వాయిదా పడిందా..?