YS Jagan: దీపావళి రోజున మాజీ సీఎం జగన్ ధరించిన ఈ షూ ధర ఎంతో తెలుసా?
సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. వాటిలో కొన్ని జనాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఒక అంశమే ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వేసుకున్న షూ గురించి. ఆ షూ గురించి సోషల్ మీడియాలో చర్చేంటి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

దీపావళి పండగ కోసం ఇటీవలే లండన్ పర్యట నుంచి తిరగి వచ్చారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విదేశీ టూర్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన జగన్ కుటుంబంతో కలసి ఆనదంగా దీపావళి పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణితో సరదగా క్రాకర్స్ కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేశారు.
అయితే క్రాకర్స్ కాల్చే సమయంలో ఆయన ధరించిన షూ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుంది. దీంతో అందని దృష్టి ఆయన ధరించే షూ పైనే పడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంతకు ఆయన వేసుకున్న షూ ఏంటి, వాటి ధర ఎంత ఉంటుందో అనే ఆలోచనలో పడ్డారు. అయితే జగన్ ధరించిన షూ ఫోటను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే అవి Asics కంపెనీకి చెందినవిగా తేలింది. ఇదొక రన్నింగ్ షూ తయారు చేసే ప్రముఖ బ్రాండ్. ASICS కార్పొరేషన్ అనేది జపాన్‌కు చెందిన సంస్థ, ఇది స్పోర్ట్స్ వస్తువుల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన సంస్థ. ఈ సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ కూడా ఎక్కువే.
జగన్ ధరించిన షూ ధర ఎంతంటే?
క్వాలిటిలో, కంఫర్ట్‌లో ఏమాత్రం కాంప్రమేజ్ కానీ ఈ కంపెనీ ఉత్పత్తులకు ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం. మాజీ సీఎం జగన్ ధరించిన షూ ఖరీదు రూ.10,999గా ఉండగా.. డిస్కౌంట్‌లో అది రూ. 8,799కి అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
