జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు అలాగే గత ఐదేళ్లలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను క్షుణ్ణంగా అందులో పొందు పరిచారు. దీని ప్రకారం గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించారు. ఇక జనసేన అధినేతకు రూ.64,26,84,453 అప్పులు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయి. ఇక వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం రూ. 20 కోట్లకు పైగానే విరాళాలు అందించారు పవన్ కల్యాణ్. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు.
అలాగే వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందచేసినట్లు తన నామినేషన్ పత్రాల్లో చూపంచారు పవన్ కల్యాణ్..
క్లుప్తంగా..
పిఠాపురం శాసనసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ @PawanKalyan గారు @pithapuramjsp#PawanKalyanWinningPithapuram#VoteForGlass#Pithapuram pic.twitter.com/0Ou5LCbffP
— JanaSena Party (@JanaSenaParty) April 23, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..