Andhra: సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సర్.? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలిస్తే షాకే
నిబంధనలు పాటించాలని చెప్పేవారే ఆ నిబంధనలను పాటించకపోతే జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు.. అందులోనూ జిల్లాని నడిపిస్తున్న ఆ ఇద్దరు ఉన్నతాధికారులే.. నిబంధనలు మర్చిపోతే ఎలా.? ఆ వివరాలు ఏంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఇందులో చూసేద్దాం. ఓ సారి లుక్కేయండి మరి.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్.. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? సత్య సాయి బాబా శతజయంతి వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ బైక్‌పై వెళ్లారు. ఆ బైక్ వెనుక సీటులోనే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా కూర్చున్నారు. అలా ఇద్దరు ఉన్నతాధికారులు బైక్‌పై చక్కర్లు కొట్టారు. కానీ బైక్ డ్రైవ్ చేస్తున్న కలెక్టర్ శ్యాంప్రసాద్ హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయారు. కనీసం వెనక కూర్చున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయినా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని గుర్తు చేయకపోవడం గమనార్హం.
అలా పట్టణంలోని పలు ప్రాంతాలలో బైక్‌పై హెల్మెట్ పెట్టుకోకుండానే సత్య సాయి బాబా జయంతి వేడుకలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించే జిల్లా ఉన్నతాధికారులే బైక్‌పై హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ బైక్‌పై తిరుగుతున్న ఫోటోలు చూసి నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అని చెబుతారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మరణాలు జరుగుతున్నాయని చెప్పే జిల్లా కలెక్టర్, ఎస్పీలు. అదే నిబంధన స్వయంగా ఆ ఇద్దరు ఉన్నతాధికారులు పాటించకపోవడం కచ్చితంగా ప్రజలకు తప్పుడు మెసేజ్ ఇస్తున్నట్లే అవుతుందని అంటున్నారు.
