పిఠాపురంలో పవన్ పర్యటన కొనసాగుతోంది. మూడురోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అలాగే రహదారుల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ అనేక శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ముందుగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఉన్నతాధికారుతలో చర్చించారు. దీనిపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కొన్ని ముఖ్య సూచనలు, సలహాలు చేశారు. అలాగే మరిన్ని శాఖలపై కూడా ఫోకస్ పెడుతున్నారు ఆయన. అందులో భాగంగా ఇంటింటికి కొళాయి నీరు అందించేలా, మంచి నీటికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగా జలవనరుల శాఖ జిల్లా అధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పంచాయితీలను అభివృద్ది చేసి.. దేశంలోనే గొప్పగా చెప్పుకునేలా చేస్తానని ఆశాఖ మంత్రిగా మాటిస్తున్నానని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పంచాయితీ రాజ్ శాఖలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటానని చెప్పారు. అలాగే తాను నిర్వహిస్తున్న అటవీశాఖలో ప్రక్షాళన చేస్తామన్నారు. ఇబ్బందిపెట్టి బయపెట్టేలా కాకుండా పరిశ్రమల నుంచి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే జిల్లా స్థాయి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే జూలై 1న ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో తొలిరోజు పింఛన్ల పంపిణీ.. కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు, పిఠాపురం వాసులకు కీలక హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం.
తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానన్న పవన్.. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానన్నారు. పిఠాపురంలో గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పింఛన్ల పంపిణీలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతపాలకులపై అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే గొల్లప్రోలులో నిర్వహించిన జనసేన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పలు కీలక హామీలు ఇచ్చారు. దేశానికి, రాష్ట్రానికి తాముఇచ్చే పరిస్థితిలో ఉండాలికానీ తీసుకునే పరిస్థితిలో ఉండకూడదన్నారు. రాష్ట్రంలో మైనింగ్ , ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా అవినీతి జరిగిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కడప లాంటి చోట బరైటీస్ మైన్స్ ఖాళీ చేశారని చెప్పారు పవన్. గతపాలకులపై ప్రతీకారం ఉండదని హామీ ఇచ్చిన పవన్.. పనిష్మెంట్స్ మాత్రం ఉంటాయన్నారు. తన చివరి శ్వాసవరకూ ప్రజల్లో, ప్రజలతో ఉంటానని చెప్పారు. పిఠాపురం ప్రజలకు తానెప్పుడు రుణగస్తుడనేనని తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి పాటుపడతానంటూ మరో ప్రమాణం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..