AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapuram: అనంతలో జింక మాంసం కలకలం.. మాంసం వండుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

Anantapuram: జంతువధపై ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని ఉల్లంగిస్తూ.. జింకలు, దుప్పి , పులి వంటి జంతువులను చంపుతున్న ఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా అనంతపురం జిల్లా..

Anantapuram: అనంతలో జింక మాంసం కలకలం.. మాంసం వండుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
Deer Meat In Anantapur
Surya Kala
|

Updated on: Feb 27, 2022 | 4:19 PM

Share

Anantapuram: జంతువధపై ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని ఉల్లంగిస్తూ.. జింకలు, దుప్పి , పులి వంటి జంతువులను చంపుతున్న ఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా అనంతపురం జిల్లా(Anantapuram District)లో జింక మాంసం బయటపడిన ఘటన కలకలం రేపింది.. జిల్లాలోని బెళుగుప్ప మండలం(Beluguppa Mandal ) విరుపాపల్లిలో ఓబులయ్య అనే వ్యక్తి ఇంట్లో జింక మాసం లభ్యమైంది.. ఇంట్లో సుమారుగా 2 కేజీ ల జింక మాంసాన్ని వండుతున్నట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు అందిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు, విరుపాపల్లి లోని ఓబులయ్య ఇంట్లో సోదాలు నిర్వహించగా, జింకమాసం తో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.. జింక మాంసం స్వాధీనం చేసుకొని ఓబులయ్య ను అదుపులోకి తీసుకున్న అధికారులు… కళ్యాణదుర్గం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

జింకను ఎక్కడ చంపారు.. ఎవరు చంపారు.. తెర వెనుక ఎంతమంది ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కళ్యాణదుర్గం ఉరవకొండ గుంతకల్లు తదితర ప్రాంతాల్లో జింకల సంచారం ఎక్కువగా ఉంటుంది. పొలాల్లో ఆహారం కోసం జింకలు వచ్చినప్పుడు వాటిని చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:

ఉక్రెయిన్‌లో భీకర పోరు.. కీవ్‌ తర్వాత పుతిన్ నెక్స్ట్ టార్గెట్ ఖర్కీవ్‌..

2ఏళ్ల చిన్నారి బాలుడి కోరిక తీర్చిన పైలెట్.. చిన్నారి నవ్వుకి నెటిజన్లు ఫిదా..