Andhra Pradesh: ఆ జింక మృతికి కారణమేంటో..? పోస్ట్ మార్టం నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు

| Edited By: Srilakshmi C

Dec 19, 2023 | 9:08 AM

ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో నివసిస్తున్న ఓ కృష్ణ జింక మృత్యువాత పడిన ఘటన వెలుగు చూసింది. తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమంచటంతో కృష్ణ జింక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో చోటుచేసుకుంది. పెద్ద తాడేపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం గత కొంతకాలంగా స్కూల్ ప్రాంగణంలో సుమారు 25 కృష్ణ జింకలను పెంచుతున్నారు. వాటి పోషణ కొరకు..

Andhra Pradesh: ఆ జింక మృతికి కారణమేంటో..? పోస్ట్ మార్టం నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు
Deer Died In School
Follow us on

ఏలూరు, డిసెంబర్‌ 19: ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో నివసిస్తున్న ఓ కృష్ణ జింక మృత్యువాత పడిన ఘటన వెలుగు చూసింది. తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమంచటంతో కృష్ణ జింక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో చోటుచేసుకుంది. పెద్ద తాడేపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం గత కొంతకాలంగా స్కూల్ ప్రాంగణంలో సుమారు 25 కృష్ణ జింకలను పెంచుతున్నారు. వాటి పోషణ కొరకు అక్కడ ఆహ్లాద తర్వాత ఏర్పాటు చేశారు. వాటిని ఎప్పుడు కంటికి రెప్పలా సంరక్షిస్తూ వాటి బాగోగులు చూసుకుంటున్నారు. ప్రతినిత్యం వాటికి కావాల్సిన ఆహారం నీరు అందిస్తూ, అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు పశువైద్యులతో వాటికి వైద్య చికిత్సలు అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు.

పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు సైతం వాటిని చూస్తూ ఆనందంగా గడిపే వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వాటి రక్షణ కోసం చుట్టూ ఇనుప మెస్లతో రక్షణ వలయాన్ని సైతం ఏర్పాటు చేసి ఎంతో బాధ్యతగా వాటిని పెంచి పోషిస్తున్నారు. అయితే హఠాత్తుగా అందులో ఓ కృష్ణ జింక తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. గత రాత్రి అక్కడున్న కొన్ని కృష్ణాజింకలు ఒక జింకపై వాటి కొమ్ములతో బలంగా దాడి చేశాయి. ఆ దాడిలో ఓ జింక తీవ్రంగా గాయాల పాలై అధిక రక్తస్రావమై మృతి చెందింది. జింక గాయాలతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం వెంటనే స్థానిక రెవెన్యూ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు జింక మృతదేహం పై ఉన్న గాయాలను పరిశీలించి పాఠశాల యాజమాన్యాన్ని అడిగి మరిన్ని వివరాలు సేకరించారు. అంతేగాక మిగిలిన కృష్ణ జింకల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వాటిలో మిగతా వాటికి ఏమైనా గాయాలు అయ్యాయా లేదా అని తెలుసుకునే కార్యక్రమాల్లో వాటినీ స్వయంగా పరిశీలించారు. అనంతరం జింక మృత కళేబరానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఫిరోజ్ సెక్షన్ ఆఫీసర్ అబ్దుల్ సమక్షంలో పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.