Andhra Pradesh: కొడుకే కూతురైంది.. తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది..

|

Jun 07, 2023 | 6:10 AM

టెక్నాలజీలో పురుషులకు ధీటుగా మహిళలు దూసుకుపోతున్నా.. పితృకర్మల విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి.. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ.. ఇప్పుడు, కొంతమంది మహిళల్లో మార్పులొస్తున్నాయి.

Andhra Pradesh: కొడుకే కూతురైంది.. తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది..
Daughter Perform Final Rituals
Follow us on

ప్రతి తండ్రి తన అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకును వారసుడుగా కోరుకుంటారు.. పున్నామ నరకం నుంచి తలకొరివి పెట్టిన కొడుకు తప్పిస్తాడని భావిస్తాడు.. కానీ కొడుకు కంటే కూతురు తక్కువేం కాదంటూ కూతురే కొడుకై తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన బాపట్లజిల్లా సోపిరాలలో చోటు చేసుకుంది.. ప్రపంచం టెక్నాలజీలో జెట్‌ స్పీడ్‌తో ముందుకెళ్తున్నా సమాజంలో స్త్రీ, పురుష బేధభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు.. ఉద్యోగం.. టెక్నాలజీలో పురుషులకు ధీటుగా మహిళలు దూసుకుపోతున్నా.. పితృకర్మల విషయాల్లో స్త్రీలపై ఆంక్షలు అలాగే ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోతే కొడుకులే కర్మలు చేయాలి.. ఒకవేళ వారికి మగపిల్లలు లేకపోతే బంధువుల్లో ఎవరైనా కర్మకాండలు నిర్వహిస్తారు. కానీ.. ఇప్పుడు, కొంతమంది మహిళల్లో మార్పులొస్తున్నాయి. అలాంటి కట్టుబాట్లకు చెక్‌ పెడుతున్నారు. మగపిల్లలను కన్నట్లుగానే తమను కూడా కన్నారు.. అలాంటప్పుడు.. తామెందుకు కర్మకాండలు చేయకూడదంటూ తల్లిదండ్రుల కర్మకాండలు నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన తుమ్మలపెంట వెంకట్రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయత్రం మరణించాడు . ఇతనికి కుమారులు లేరు .

ఈ నేపథ్యంలో వెంకటరావు పెద్ద కుమార్తె అంజలి మంగళవారం శాస్త్రోక్తంగా కన్నతండ్రి అంత్యక్రియలను నిర్వహించింది. వెంకటరావు అంతిమయాత్రకు ముందు నడవడమే కాకుండా చితికి కొరివి కూడా పెట్టి కన్న తండ్రి రుణం తీర్చుకుంది. కొడుకులు లేని తండ్రికి కూతురే అన్నీ తానై ఈరోజు ఉదయం తలకొరివి పెట్టింది . ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది . అందరూ ఆమెకు తోడు నిలబడ్డారు . దీనిని చూసిన వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు . కుమార్తె అంజలి అన్ని తనై తండ్రికి తలకొరివి పెట్టి కర్మకాండలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది.

 

ఇవి కూడా చదవండి

Daughter Perform Final Rituals

ఫైరోజ్‌ బేగ్‌, టీవీ9 రిపోర్టర్‌, ఒంగోలు..

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..