ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తుఫాన్ ప్రభావంతో 435 ఎకరాల్లో వరిపంట నష్టం వాటిల్లింది. గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ పడింది. అత్యధికంగా నగరిలో 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంలో తిరుపతి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మరోవైపు చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అటు పుదుచ్చేరిలోని కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురిశాయి.
ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్
ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిపోయింది. పలు జిల్లాలను మబ్బులు కమ్మేశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. తుఫాను కారణంగా రాష్ట్రంలో చలి తగ్గింది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 14.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో 15.9 డిగ్రీల నుంచి 21.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..