AP Rains: తుఫాన్ ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'దానా' తుఫానుగా బలపడింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను 24వ తేదీన తీవ్ర తుఫానుగా బలపడి.. తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ వివరాలు ఇలా..

AP Rains: తుఫాన్ ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్షాలు
Ap Rains
Follow us

|

Updated on: Oct 23, 2024 | 3:24 PM

మంగళవారం తూర్పు మధ్య బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర వాయుగుండం బలపడి, ‘దానా’ తుఫానుగా మారి, వాయువ్య దిశగా గత 6 గంటలలో గంటకు 15 కి.మీ వేగంతో కదిలి, బుధవారం అనగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 08.30 గంటలకు అదే ప్రాంతంలో 16.5° ఉత్తర అక్షాంశం, 89.6° తూర్పు రేఖాంశం వద్ద.. దాదాపు పారాదీప్(ఒడిశా)కు ఆగ్నేయంగా 520 కి.మీ.. సాగర్‌ ద్వీపం(పశ్చిమ బెంగాల్)కు ఆగ్నేయంగా 600 కి.మీ.. ఖేపుపరా(బంగ్లాదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 610 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.

ఇది చదవండి: ఓ మై గాడ్.! కారు కొన్నంత ఈజీగా విమానాన్ని కొనేయొచ్చు.. ఎలాగో తెల్సా

ఇది వాయువ్య దిశగా పయనించి, 24వ తేదీ తెల్లవారుజామున, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడుతుంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల దగ్గర, పూరి, సాగర్ ద్వీపం మధ్య, భిటార్కనికా, ఢమరా(ఒడిశా)కు దగ్గర 24వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 25వ తేదీ ఉదయానికి, తీవ్రమైన తుఫానుగా గాలి గంటకు 100-110 కిమీ వేగంతో, గరిష్టంగా 120 కిమీ వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య లేదా ఉత్తర దిశగా గాలులు వీస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ——————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- —————————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: లక్షకు రూ. 3 లక్షలు.. పైగా ప్రతీ ఏటా రూ. 12 వేలు.. మ్యాజిక్ చేసే మల్టీబ్యాగర్ స్టాక్

రాయలసీమ :- ———–

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: మంచు కొండల్లో అదో మాదిరి వింత ఆకారం.. విషయం తెలిస్తే.. అయ్యబాబోయ్.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..