Andhra Pradesh: స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో మరో ముందడుగు
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో మరో ముందడుగు పడింది. ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణం స్పీడందుకుంటోంది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ టెండర్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సీఆర్‌డీఏ. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు... ఆ పరిధిలో ఉన్న గ్రామాలను సైతం అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ 46 సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారులు కల్పించారు. అసెంబ్లీ, హైకోర్టు భవన టెండర్లకు సమావేశం ఆమోదం తెలిపింది. L1 కేటగిరిగా గుర్తింపు పొందిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలని సీఆర్‌డీఏ మీటింగ్‌లో నిర్ణయించారు. అమరావతి అంటే అంతర్జాతీయ రాజధాని. అందులో ఏపీ నూతన అసెంబ్లీ ఇక మాములుగా ఉండదు. 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ..250 ఎత్తులో ..మూడంతస్తుల్లో ఏపీ అసెంబ్లీకి ఠీవీగా నిర్మించనున్నారు.
ఇక న్యాయం అభయం ఇచ్చినట్టుగా ఏడంతస్తుల ఏపీ హైకోర్టు అమరావతికి హైలైట్ నిలవనుంది. 20.32 లక్షల చదరపు అడుగుల్లో 7 అంతస్తుల్లో ఏపీ హైకోర్టును నిర్మించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు.. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
2015 అక్టోబర్ 22న..విజయదశమి రోజు అమరావతికి శంకుస్థాపన చేవారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్లీ అదే జోడీ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పున: నిర్మాణ పనులను ప్రారంభించేలా కార్యాచరణ సిద్దమవుతోంది. రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేలా ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్.
ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి రాజధానిలో కీలక నిర్మాణాలు పూర్తి చేయాలన్న టార్గెట్‌తో ముందుకు వెళ్తోంది. నిధుల కోసం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం జరిగాయి. 40 వేల కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు… ఆ పరిధిలో ఉన్న గ్రామాలను సైతం అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చిన గ్రామాలను అక్కున చేర్చుకుంటూ… అక్కడ మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.. సీఆర్డీఏ. అదిగో అమరావతి.. అంతర్జాతీయ స్థాయి ఆంధ్ర రాజధాని..




