Jockey Industry: తీవ్ర దుమారం రేపుతున్న జాకీ పరిశ్రమ వివాదం.. ఎమ్మెల్యే తోపుదుర్తిపై డీఎస్పీకి ఫిర్యాదు..

|

Nov 26, 2022 | 1:15 PM

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు సీపీఐ నేతలు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి ఎమ్మెల్యే కారణమంటూ ఆరోపించారు. అవును, అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ వివాదం తీవ్ర దుమారం రేపుతుంది.

Jockey Industry: తీవ్ర దుమారం రేపుతున్న జాకీ పరిశ్రమ వివాదం.. ఎమ్మెల్యే తోపుదుర్తిపై డీఎస్పీకి ఫిర్యాదు..
Mla Thopudurthi Prakash Red
Follow us on

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు సీపీఐ నేతలు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి ఎమ్మెల్యే కారణమంటూ ఆరోపించారు. అవును, అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. మొన్నటి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య చెలరేగిన వివాదం ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ గా తయారైంది. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల సునీత మధ్య నెలకొన్న జాకీ పరిశ్రమ వివాదంలోకి సీపీఐ నాయకులు ఎంటర్ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు సీపీఐ నేతలు. జాకీ పరిశ్రమను బెదిరించిన ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పై సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ డీఎస్పీని కలిసి పిర్యాదు చేశారు సీపీఐ నాయకులు.

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీరు వల్లే జాకీ కంపెనీ తెలంగాణకు తరలిపోయిందంటూ ఆరోపించారు సీపీఐ నేతలు. జాకీ పరిశ్రమ ప్రతినిధులను ఎమ్మెల్యే 10 కోట్లు డిమాండ్ చేశారని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్. ఎమ్మెల్యే బెదిరింపుల వల్లే పరిశ్రమ వెనక్కి పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కరువు కాటకాలతో వలసలు పోతున్న జిల్లాలో ఉపాధి అవకాశాలను దెబ్బతీయ్యడం సరైన పద్దతి కాదని హితవు పలికారు సీపీఐ అనంతపురం జిల్లా అధ్యక్షులు జాఫర్. అతివృష్టి, అనావృష్టితో ఇప్పటికే జిల్లా ప్రజలు సతమతమవుతుంటే పరిశ్రమ ప్రతినిధులను బెదిరించి తరలిపోయేలా చేయడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే తీరుపై ప్రశ్నించిన వారిని బెదిరించడం, కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించడం సరైన పద్దతి కాదన్నారు. ఈఘటనను సుమోటోగా తీసుకొని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రెడ్డి విచారణ ఎదుర్కొని.. నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. జాకీ పరిశ్రమను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఐ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..