Today Cotton Price: పత్తి రైతులకు కాసుల పంట.. ఆదోని మార్కెట్ యార్డులో దేశంలోనే అత్యధిక ధర

|

Jan 20, 2022 | 4:24 PM

పత్తి రైతులు ఈ ఏడాది ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వారి పంట పండింది. తెల్ల బంగారానికి కాసుల పంట పండుతోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డ్‌ ధర పలుకుతోంది.

Today Cotton Price:  పత్తి రైతులకు కాసుల పంట.. ఆదోని మార్కెట్ యార్డులో దేశంలోనే అత్యధిక ధర
Cotton Exports
Follow us on

పత్తి రైతులు ఈ ఏడాది ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వారి పంట పండింది. తెల్ల బంగారానికి కాసుల పంట పండుతోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డ్‌ ధర పలుకుతోంది. ప్రజంట్ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి ధర అ’దర’హో అనిపించింది. గురువారం ఊహించని రీతిలో రూ.10 వేలకు పైగా  పత్తి ధర పలికింది. దేశంలో ఏ ఇతర మార్కెట్ యార్డులలో పలకని పత్తి ధర ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అందింది. క్వింటాలు గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఉత్తరాది రాష్ట్రాలు మహారాష్ట్ర,  గుజరాత్, హర్యానా, ఒరిస్సా తో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలోనూ అధిక వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయింది. దేశంలో స్పిన్నింగ్ మిల్లులలో ఉత్పత్తికి అవసరమైన దూది కొరత ఏర్పడింది.  దీంతో అంతర్జాతీయ మార్కెట్లో దూది డిమాండ్ పెరగడంతో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ని పత్తి ధరలు  రికార్డు స్థాయిలో రైతులకు అందింది. వ్యాపారుల మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడి ధరలు పెరగడానికి కారణమైంది. ఆదోనిలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ పరిశ్రమలు అధికంగా ఉండడంతో దూది బేళ్ల  ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్ కు మందకొడిగా వస్తుండడంతో స్థానిక వ్యాపారులు పోటీపడి ధరలు పెంచుతున్నారు.  అధిక ధరల పలుకుతుండటంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు గుడ్‌ న్యూస్.. డీఏ ఉత్తర్వులు జారీ.. ఇవిగో పూర్తి వివరాలు

సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్