దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా కేరళ, మహారాష్ట్ర, లతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి..అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 47మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.. పి.గన్నవరం సీహెచ్‌సీలో ఐదుగురికి కరోనా సోకింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదే విషయంపై జిల్లా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణమే రోజు రోజుకు పెరుగుతున్న కేసులకు కారణం అని చెప్పారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా డి.గన్నవరం CHC లో ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 కోవిడ్ కేసులు నమోదయ్యాయని.. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కరోనా నిర్ధారణ అయినా బాధితులు హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరుగా అందరూ కోలుకుంటున్నారని. పరిస్థితులు ఆందోళన కరంగా లేవని.. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు దుర్గారావు.
.మరోవైపు కాకినాడలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి..ఇప్పటివరకూ కేసులే అనుకుంటే ఇప్పుడు మరణాలు సంభవించడం ఆందోళన కారణమైంది.. కాకినాడ జీజీహెచ్‌లో కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు..న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరారు పేషెంట్లు..ఆ ఇద్దరికి కరోనా సోకడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..