AP Coronavirus: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Jan 29, 2022 | 5:46 PM

Andhra Pradesh Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌

AP Coronavirus: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Ap Corona
Follow us on

Andhra Pradesh Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. నిత్యం చాలా జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో (శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం 9 గంటల వరకు) 40,635 శాంపిల్స్ ని పరీక్షించగా 11,573 మందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే.. కేసులు సంఖ్య తగ్గింది. దీంతోపాటు ఈ (Coronavirus) మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 9,445 మంది కోలుకున్నారు.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2260181 కి చేరగా.. మరణాల సంఖ్య 14,594కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి 2130162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 115425 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,24,06,132 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

కాగా కొత్తగా వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా 1942 రదటగోగ కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత కర్నూలులో 1522, గుంటూరులో 1298, విశాఖపట్నంలో 1024 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..

Ap Corona

Also Read:

Major: అడవి శేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..? మేజర్ రిలీజ్ పై సస్పెన్స్..

Ayurveda: ఆయుర్వేదం ప్రకారం భోజన నియమాలు మీకు తెలుసా..?