AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Self Lockdown : ఏపీలో దడపుట్టిస్తోన్న కరోనా, పట్టణాలు.. గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తోన్న జనం

Villagers impose self-lockdown In Andhra Pradesh : ఏపీలో కరోనా దడపుట్టిస్తోంది. పట్టణాలు .. గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది..

Self Lockdown : ఏపీలో దడపుట్టిస్తోన్న కరోనా, పట్టణాలు.. గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తోన్న జనం
Lockdown in ap
Venkata Narayana
|

Updated on: Apr 18, 2021 | 10:04 AM

Share

Villagers impose self-lockdown In Andhra Pradesh : ఏపీలో కరోనా దడపుట్టిస్తోంది. పట్టణాలు .. గ్రామాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. తమ ఊరికి ఎవరు రావద్దని కోరుతున్నారు. అటు, కంటైన్మెంట్‌ జోన్లలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు తీవ్రం కావడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు మరోసారి కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు జగన్‌. మరోవైపు, కరోనా నియంత్రణకు యాక్షన్‌ ప్లాన్‌పై కసరత్తు చేస్తున్నారు అధికారులు. సోమవారం జరిగే భేటీలో సీఎం జగన్‌, రాష్ట్రంలో కరోనా ఆంక్షలు, కోవిడ్ వైద్యసేవలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌ ఉంది. అటు, తిరుమల శ్రీవారి దర్శనాలపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కరోన వైరస్ వ్యాప్తి కారణంగా టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి 15 వేల రూ.300 దర్శన టికెట్లు మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించింది.

Read also : Fashion show : విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో ఫైనల్.. ర్యాంప్ పై హంస నడకలతో అదరగొట్టిన ఆంటీలు.!